Ranji Trophy 2024: కేకేఆర్ బ్యాటర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్!
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లతో 193) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఎలైట్ గ్రూప్ సీలో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 46.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెహాల్ వాధేరా(79 బంతుల్లో 7 ఫోర్లతో 44) మినహా అంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్(7/41) ఏడు వికెట్లు తీయగా.. విజయ్ కుమార్ వైశాఖ్(2/35) రెండు వికెట్లు తీసారు. రోహిత్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన కర్ణాటక 123 ఓవర్లలో 6 వికెట్లకు 461 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్‌తో పాటు మనీష్ పాండే(165 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118) సెంచరీతో రాణించాడు. శ్రీనివాస్ శరత్(55 బ్యాటింగ్) సత్తా చాటాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రేరిత్ దుట్టా, నమాన్ ధీర్ తలో రెండు వికెట్లు తీసారు.
ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రేడింగ్ చేసుకుంది. గతంలో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించిన దేవదత్ పడిక్కల్.. ఆ జట్టు తరఫునే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత్ తరఫున శ్రీలంక పర్యటనలో అంతర్జాతీయ టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications