For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy 2022: అరంగేట్రంలోనే శతక్కొట్టిన యశ్ ధుల్! మరో కోహ్లీలా...

Ranji Trophy 2022: Yash Dhull scores century on first-class debut for Delhi against Tamil Nadu

గౌహతి: అండర్-19 ప్రపంచకప్‌ టోర్నీలో యంగ్ ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ యశ్ ధుల్.. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు.
తద్వారా తన ఫస్ట్ రంజీ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ఢిల్లీ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యశ్ ధుల్.. తనదైన బ్యాటింగ్‌తో మరో కోహ్లీని తలపిస్తున్నాడు.

రెండేళ్ల విరామం తర్వాత..

రెండేళ్ల విరామం తర్వాత..

ఇక సుదీర్ఘ విరామం అనంతరం నేడు(గురువారం) రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. ఇండియా క్రికెట్‌కు వెన్నుముకగా ఉన్న ఈ మెగా ట్రోఫీకి కరోనా కారణంగా రెండేళ్లు బ్రేక్ పడింది. మూడో వేవ్ నుంచి కాస్త ఉపశమనం లభించడంతో డొమెస్టిక్ క్రికెటర్ల ఎదురుచూపులు ఫలించాయి. బీసీసీఐ పక్కాగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఈ టోర్నీ మొదలైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు గౌహతి వేదికగా మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి.

130 బంతుల్లోనే..

130 బంతుల్లోనే..

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్‌ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. అండర్ 19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకున్న యశ్ ధుల్.. తన ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా బరిలోకి దిగి దుమ్మురేపాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నానే బెరుకు లేకుండా తనదైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ క్రమంలో 136 బంతుల్లోనే యశ్ ధుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతను 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. మహమ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

మరో కోహ్లీ అంటూ..

మరో కోహ్లీ అంటూ..

ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్‌లోనే యశ్ ధుల్ సెంచరీ చేయడంపై అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యశ్‌ ధుల్‌ మరో కోహ్లీ అవుతాడంటూ కొనియాడుతున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ రూ. 50 లక్షల రూపాయలకే యశ్‌ ధుల్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇక యశ్ ధుల్‌కు అండగా.. జాంటీ సింధు(71) హాఫ్ సెంచరీతో రాణించగా.. లలిత్ యాదవ్(43 నాటౌట్) పోరాడుతున్నాడు. ప్రస్తుతం 88 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. క్రీజులో లలిత్ యాదవ్‌తో పాటు సిమ్రన్‌జిత్ సింగ్(16 నాటౌట్) ఉన్నాడు.

Story first published: Thursday, February 17, 2022, 16:36 [IST]
Other articles published on Feb 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+