Ranji Trophy 2022: సువేద్ పార్కర్ డబుల్.. ఉత్తరాఖండ్ ట్రబుల్!

ఆలుర్: ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై పట్టు బిగించింది. తన తొలి మ్యాచ్‌లోనే సువేద్ పార్కర్(252) డబుల్ సెంచరీతో చెలరేగాడు. గాయంతో దూరమైన అజింక్యా రహానే స్థానంలో జట్టులోకి సువేద్ పార్కర్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు. అతనికి తోడుగా సర్ఫరాజ్ ఖాన్(153) భారీ సెంచరీతో సత్తా చాటడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌ను 647/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఉత్తరాఖండ్ రెండో రోజు మంగళవారం ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 39/2తో నిలిచింది. కమల్ సింగ్ (27), కునాల్ చండేలా (8) క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 304/3తో మంగళవారం, రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబైని సువేద్, సర్ఫ్‌రాజ్ నడిపించారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 267 పరుగులు జత చేసి ముంబైకి భారీ స్కోరు అందించింది. ఈ క్రమంలోనే సువేద్.. రంజీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన పన్నెండో ఆటగాడిగా ఘనత సాధించాడు. అతనికి తోడు సర్ఫ్‌రాజ్ కూడా ధాటిగా ఆడి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరే కాక ఇన్నింగ్స్ ఆఖర్లో సామ్స్ ములాని (59) అర్ధ సెంచరీ చేయడంతో ముంబైకి భారీ స్కోరు సమకూరింది.

సుదీప్ 186.. మజుందార్ 117..
జార్ఖండ్‌తో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో బెంగాల్ రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 577/5 స్కోరు చేసింది. సుదీప్ గరామి (186) అనుస్తప్ మజుందార్ (117) సెంచరీలు సాధించారు. ఓవర్‌నైట్ స్కోరు 310/1తో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్.. సుదీప్, మజుందార్ సత్తా చాటడంతో భారీ స్కోరు దిశగా సాగింది.
ఆట తొలి రోజే సెంచరీ సాధించిన సుదీప్ రెండోరోజు ద్విశతకాన్ని అందుకునేలా కనిపించినా కొద్దిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. కానీ మజుందార్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. వీళ్లిద్దరూ కాక మనోజ్ తివారి (54 బ్యాటింగ్), అభిషేక్ పొరెల్ (68) అర్ధసెంచరీలు చేయడంతో బెంగాల్ 500 పరుగుల స్కోరును అందుకుంది. అభిషేక్‌తో కలిసి మనోజ్ అయిదో వికెట్‌కు 109 పరుగులు జత చేశాడు. ఆట ఆఖరికి షాబాజ్ (7)తో కలిసి తివారి క్రీజులో ఉన్నాడు.

మధ్యప్రదేశ్ 238/2..
పంజాబ్‌తో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ప్రత్యర్థిని 219 పరుగులకే ఆలౌట్ చేసిన మధ్యప్రదేశ్.. రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 5/0తో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ను శుభమ్ శర్మ (102 నాటౌట్)నడిపించాడు.
అతడు అజేయ సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేశాడు. శుభమ్‌కు తోడు హిమాంశు (89) రాణించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 120 పరుగులు జత చేసింది. ఆట చివరికి శుభమ్‌తో పాటు రజత్ పటీదార్ (20) క్రీజులో ఉన్నాడు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే (2/70) మాత్రమే రాణించాడు.
ఒకే రోజు 21 వికెట్లు
ఉత్తర్‌ప్రదేశ్‌తో రంజీ క్వార్టర్‌ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేసి ఆ తర్వాత ప్రత్యర్థిని 155 పరుగులకే ఆలౌట్ చేసిన కర్ణాటక.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. సౌరభ్ కుమార్ (3/32), అంకిత్ రాజ్‌పుత్ (2/15) విజృంభించడంతో 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ (22) తప్ప మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల ఆధిక్యం సాధించిన కర్ణాటక మొత్తం మీద 198 పరుగులతో ముందంజలో ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 213/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 253 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (56 నాటౌట్) అర్ధసెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బదులుగా ఉత్తర్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. రోనిత్ మోర్ (3/47), వినయ్ కుమార్ (2/29), విద్వత్ (2/19), కృష్ణప్ప గౌతమ్ (2/43) ప్రత్యర్థి పతనంలో పాలుపంచుకున్నారు. ప్రియమ్ గార్గ్ (39), రింకు సింగ్ (33), శివమ్ మావి (32) రాణించకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. దాంతో ఒకే రోజు 21 వికెట్లు పడ్డాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications