Ranji Trophy 2022: రఫ్ఫాడించిన రవితేజ.. శతక్కొట్టిన విహారి! హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ!

కటక్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2022లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ శుభారంభం చేసింది. చండీగడ్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ 217 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా హైదరాబాద్‌కు 6 పాయింట్లు లభించాయి. 21/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు కొనసాగించిన చండీగఢ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 183 రన్స్‌కే కుప్పకూలింది.
ఆర్సలన్ ఖాన్(68), రాజ్ బవా(35 నాటౌట్), అంకిత్ కౌశిక్(32) రాణించినా ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ పేసర్ రవి తేజ(6/41), రక్షణ్ రెడ్డి(3/62) ఖతర్నాక్ బౌలింగ్‌తో చండీగడ్ పతనాన్ని శాసించారు. 6 వికెట్లతో చెలరేగిన రవితేజకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు కుప్పకూలింది. హనుమ విహారి(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చండీగఢ్ 216 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా(116) ఒక్కడే సెంచరీతో రాణించాడు. ఇక 131 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్.. 269/8 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. మరోసాని హనుమ విహారి(106) సెంచరీతో చెలరేగగా.. తిలక్ వర్మ(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చండీగడ్ 183 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.
ఆంధ్ర పరాజయం..
ఈ సీజన్ రంజీ ట్రోఫీని ఆంధ్ర క్రికెట్ జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. రాజస్తాన్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ 'ఇ' తొలి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్ లో 53.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.
చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 100/4తో ఆట కొనసాగించిన ఆంధ్ర మరో 109 పరుగులు జతచేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (39; 6 ఫోర్లు), తపస్వి (44; 6 ఫోర్లు, 1 సిక్స్), సందీప్ (43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. రాజస్తాన్ బౌలర్లలో శుభమ్ శర్మ(4/32), అనికేత్ చౌదరి(3/50) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా... ఈనెల 27 నుంచి జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో ఆంధ్ర తలపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications