Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పృథ్వీ షానా మజాకా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు!

Ranji Trophy 2022: Prithvi Shaw Rare Partnership with Yashasvi Jaiswal Breaks 134 Years Record

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్, ముంబై కెప్టెన్ పృథ్వీ షా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా(71 బంతుల్లో 12 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు తనను ఎంపిక చేయలేదనే కోపమో.. లేక యాదృశ్చికంగా ఆడాడో తెలియదు కానీ.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి 134 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ శైలిని తలపించే షా.. నాన్‌స్ట్రైకర్‌ను నిలబెట్టి పరుగులు బౌండరీలతో పరుగులు రాబట్టాడు.

66లో 64 షా వే..

66లో 64 షా వే..

మరో ఓపెనర్ జైస్వాల్‌తో కలిసి పృథ్వీ షా తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. ఇందులో పృథ్వీ షా చేసినవి 64 పరుగులు కాగా.. మరో రెండు పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. షా ఔటయ్యే సమయానికి నాన్ స్ట్రైకర్‌గా ఉన్న యశస్వీ జైస్వాల్ 52 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేదు. తొలి వికెట్‌కు జైశ్వాల్‌తో 66 పరుగులు జోడించగా.. అందులో 96.96 శాతం పరుగులు పృథ్వీ షావే. తొలి వికెట్‌కు 50 ప్లస్‌ స్కోరు చేయడంలో ఒక్క బ్యాటర్‌దే స్కోరు మొత్తం ఉండడం ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.

రెండోసారి మాత్రమే..

రెండోసారి మాత్రమే..

ఇంతకముందు 1888లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో జరిగింది. నార్త్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ పెర్సీ మెక్‌డోనెల్‌ అలెక్స్‌ బ్యానర్‌మెన్‌తో కలిసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. అందులో పెర్సీ మెక్‌డోనెల్‌వి 95.34 శాతం పరుగులు. తాజాగా 134 ఏళ్ల అనంతరం పృథ్వీ షా-జైశ్వాల్‌ జోడి ఆ రికార్డును బద్దలు కొట్టింది. 55వ బంతికి జైస్వాల్ బౌండరీ కొట్టి పరుగుల ఖాతా తెరిచాడు. ఎట్టకేలకు పరుగు తీయడంతో జైశ్వాల్‌ బ్యాట్‌ పైకి లేపగా.. ప్రత్యర్థి ఆటగాళ్లు చప్పట్లతో అభినందించడం కొసమెరుపు.

పట్టుబిగించిన ముంబై..

పట్టుబిగించిన ముంబై..

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై పట్టు బిగించింది. ఆట ముగిసే సరికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 133 పరుగులు చేసి ఓవరాల్‌గా 346 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పృథ్వీ షా (71 బంతుల్లో 12 ఫోర్లతో 64) దూకుడుగా ఆడగా, యశస్వి జైస్వాల్‌ (35 నాటౌట్‌), అర్మాన్‌ జాఫర్‌ (32 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు 25/2తో ఆట కొనసాగించిన యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. శివమ్‌ మావి (55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ముంబైకి 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Friday, June 17, 2022, 10:31 [IST]
Other articles published on Jun 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+