Ranji Trophy 2022: విఫలమైన మంత్రిగారు.. రసవత్తరంగా సెమీస్ పోరు!

ఆలూర్: రంజీట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా మధ్యప్రదేశ్, బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. విజయం కోసం రెండు జట్లూ పోరాడుతున్నాయి. 350 పరుగుల ఛేదనలో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బెంగాల్.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 96/4తో నిలిచింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (104 బంతుల్లో 6 ఫోర్లతో 52 బ్యాటింగ్) బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు.మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (3/35) ప్రత్యర్థిని కష్టాల్లోకి నెట్టాడు. అభిమన్యుతో పాటు అనుస్తప్ మజుందార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఇంకా 254 పరుగులు..
చివరి రోజు ఆటలో విజయం కోసం ఆ జట్టుకు ఇంకా 254 పరుగులు కావాలి. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో ఆరు వికెట్లు తీయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 163/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్.. ప్రత్యర్థి స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ (5/79), ప్రదీప్త (4/65) దెబ్బకు 281 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రజత్ పటీదర్ ( 149 బంతుల్లో 11 ఫోర్లతో 79), కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ ( 225 బంతుల్లో 6 ఫోర్లతో 82) మూడో వికెట్‌కు 151 పరుగులు జోడించారు. వీరి నిష్క్రమణ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది.

విఫలమైన మంత్రిగారు..
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన బెంగాల్ క్రీడల శాఖ మంత్రి, వెటరన్ ప్లేయర్ మనోజ్ తివారీ(7) రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. కార్తీకేయ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును షెహ్‌బాజ్ అహ్మద్(116)తో కలిసి మనోజ్ తివారీ(102) ఆదుకున్నాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 273 పరుగులకు కుప్పకూలింది. దాంతో మధ్య ప్రదేశ్‌కు 68 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేయడంతో బెంగాల్ ముందు 350 పరుగుల లక్ష్యం నమోదైంది.

662 పరుగుల ఆధిక్యంలో ముంబై..
41 సార్లు రంజీ ఛాంపియన్ ముంబయి మరోసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరువైంది. సెమీస్‌లో ఉత్తరప్రదేశ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆ జట్టు ప్రస్తుతం 662 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. యశస్వి జైశ్వాల్ (181; 372 బంతుల్లో 23×4, 1×6) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోగా.. అర్మాన్ జాఫర్ (127; 259 బంతుల్లో 15×4, 2×6) సెంచరీతో సత్తా చాటాడు. ఓవర్‌నైట్ స్కోరు 133/1తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబయి.. వీళ్లిద్దరి శతకాల సాయంతో 449/4తో నాలుగో రోజు ఆట ముగించింది. సర్ఫరాజ్ ఖాన్ (23 బ్యాటింగ్), శామ్స్ ములాని (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబయి ఫైనల్ చేరడం ఖాయమనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications