Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేటి నుంచే రంజీ ట్రోఫీ.. సీనియర్లు, కుర్రాళ్లకు గోల్డెన్ చాన్స్!

Ranji Trophy 2022-23 starts Today, Hyderabad takes on Tamil Nadu

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్దమైంది. టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్లకు.. భారత జట్టుకు ఆడాలని తహతహలాడుతున్న కుర్రాళ్లకు ఈ టోర్నీ గోల్డెన్ చాన్స్. 38 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీకి నేడు(మంగళవారం) తెరలేవనుంది. కరోనా కారణంగా గత రెండేళ్లు కళ తప్పిన ఈ టోర్నీ ఈసారి పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. టైటిల్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణ సాగిస్తోన్న ముంబైతో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, సౌరాష్ట్ర, విదర్భ, ఢిల్లీ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల జట్లు హైదరాబాద్‌, ఆంధ్ర ఎలైట్‌ గ్రూప్‌-బిలో పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌ సొంతగడ్డపై తన తొలి మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనుండగా.. ఇదే గ్రూపులో ఆంధ్ర విజయనగరంలో ముంబైని ఢీకొంటుంది.

ఐపీఎల్ వేలమే టార్గెట్..

ఐపీఎల్ వేలమే టార్గెట్..

భారత సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానే, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, ఐపీఎల్ ఆడాలని ఆశపడుతున్న కుర్రాళ్లకు రంజీ ట్రోఫీకి మించిన వేదిక మరొకటి ఉండదు. డిసెంబర్‌ 23న ఐపీఎల్‌ వేలం ఉన్న నేపథ్యంలో రంజీలో మెరిసి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించవచ్చు. ఇక వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయిన రహానే మళ్లీ టీమిండియా తలుపు తట్టాలంటే ఈ టోర్నీలో రాణించాల్సిందే. 12 ఏళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికైన జయదేవ్‌ ఉనద్కతే అతనికి స్ఫూర్తి.

పృథ్వీషాకు కూడా..

పృథ్వీషాకు కూడా..

మరో సీనియర్‌ ఇషాంత్‌శర్మకు కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించడం కీలకం. దేశవాళీలో సత్తా చాటుతున్నా భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయిన పృథ్వీ షాకు కూడా ఈ రంజీ సీజన్‌ ఎంతో విలువైంది. గత సీజన్ల కంటే బరువు తగ్గి ఫిట్‌గా మారిన పృథ్వీ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. భారత జట్టు చోటు ఆశిస్తున్న యశస్వి జైస్వాల్‌కు కూడా ఈ సీజన్లో రాణించడం కీలకం. టీమిండియా వెటరన్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌కు కూడా ఈ టోర్నీ చాలా ఉపయోగపడనుంది.

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ఎలైట్‌లో అగ్రశ్రేణి.. ప్లేట్‌లో చిన్న జట్లు ఉంటాయి. ఎలైట్‌లో మొత్తం 32 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ఎనిమిది జట్లు ఆడతాయి. ప్రతి గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలోని రెండు జట్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరతాయి. ప్లేట్‌లో ఆరు జట్లు ఉంటాయి. ఇవి మిగిలిన అయిదు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. టాప్‌-4 జట్లు నేరుగా ప్లేట్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ చేరిన రెండు జట్లు వచ్చే సీజన్‌లో ఎలైట్‌లో పోటీపడతాయి. ఈ సీజన్‌లో ఎలైట్‌ జట్లతో ప్లేట్‌ జట్లు తలపడవు. ఈ సారి ఎలైట్‌లో పోటీపడిన 32 జట్లలో అట్టడుగున నిలిచే రెండు జట్లు వచ్చే సీజన్లో ప్లేట్‌ గ్రూప్‌లో ఆడతాయి.

Story first published: Tuesday, December 13, 2022, 9:42 [IST]
Other articles published on Dec 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+