క్యాచ్‌తో బ్యాట్‌మన్‌కు షాకిచ్చిన రైనా(వీడియో)


హైదరాబాద్: కొన్నేళ్ల పాటు శ్రమించి టీమిండియాలోకి పునరాగమనం చేసిన భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అయినా దేశవాళీ క్రికెట్‌లో మాత్రం మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఉత్తర్ ప్రదేశ్ తరఫున ఆడుతున్న రైనా.. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్ అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో రైనా పేరు కూడా చెప్పుకోవచ్చు.

మ్యాచ్ చూస్తున్నవారంతా షాక్‌కు
తాజాగా అతని ఫీల్డింగ్ నైపుణ్యాన్ని రంజీ మ్యాచ్‌లలో చూపించాడు. స్పిన్నర్ బౌలింగ్‌లో కీపర్ పక్కనుంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతి ఒంటిచేత్తో ఆఖరి క్షణంలో రైనా ఒడిసిపట్టేశాడు. దీంతో మ్యాచ్ చూస్తున్నవారంతా షాక్‌కు గురైయ్యారు. బ్యాట్స్‌మన్ కాసేపటి వరకూ ఏమీ అర్థం కాకపోవడంతో అలా క్రీజులో నిల్చొండిపోయాడు.
పేలవ ఫామ్ కారణంగా జట్టు నుంచి
ఈ క్యాచ్‌ను మ్యాచ్ అనంతరం రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. 'ఇదర్ చలా, మై ఉదర్ చలా. జానే కహా మై కిదర్ చలా, అరె ఫిసల్ గయా..... పర్ క్యాచ్ లే లియా' అంటూ రాసుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది జూలైలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లోనూ సెలక్టర్లు అతనికి అవకాశమివ్వలేదు.

కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై
అదలా ఉంటే నవంబరు 21 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలోనూ రైనాకి చోటు దక్కలేదు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై విధ్వంసం సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు జరగనుంది.
టీ20 కోసం టెస్టు మ్యాచ్ వదులుకున్న రోహిత్ శర్మ

కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు
భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆడే మూడు సిరిస్‌ల్లో కూడా ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆడరు.దీంతో.. దేశవాళీ టోర్నీలో సత్తాచాటి.. మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆశిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications