
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత రెండు దశల్లో జరిగే ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మ్యాచ్‌ల సంఖ్య భారీగా తగ్గింది. 38 జట్లు పోటీపడ్డ లాస్ట్ సీజన్‌లో 169 మ్యాచ్‌లు జరగ్గా.. ఈ సారి కేవలం 64 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ టోర్నీ ఫార్మాట్‌ను మార్చడమే ఇందుకు కారణం. కొత్త ఫార్మాట్ ప్రకారం లీగ్ దశలో ఒక జట్టు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్, ఫార్మాట్‌ను బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం స్టేట్ అసోసియేషన్స్‌కు ఈ మెయిల్ చేశారు.
దీని ప్రకారం రంజీ ట్రోఫీ తొలి దశ ఈ నెల 10 నుంచి మార్చి 15 వరకు జరగనుంది. రెండో దశ ఐపీఎల్ ముగిసిన తర్వాత మే 30 నుంచి జూన్ 26 మధ్య జరగనుంది. ఈసారి రంజీ ట్రోఫీకి ఎలైట్ విభాగంలో 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. మిగతా ఆరు జట్లు ప్లేట్ విభాగంలో ఉంటాయి. టోర్నమెంట్లో 62 రోజుల్లో మొత్తం 64 మ్యాచ్‌లు ఉంటాయి. తొలి దశలో 57 మ్యాచ్‌లు జరుగుతాయి. రెండో దశలో ఏడు నాకౌట్ మ్యాచ్‌లు (నాలుగు క్వార్టర్స్, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) ఉంటాయి.
రాజ్‌కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, త్రివేండ్రం, దిల్లీ, హరియాణా, గువాహటిలో ఎలైట్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్లేట్ లీగ్ మ్యాచ్‌లకు కోల్‌కతా వేదిక. ఒక్క గ్రూప్ నుంచి తప్ప ఎలైట్ గ్రూప్‌లో ప్రతి గ్రూప్ నుంచి ఓ జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెడుతుంది. ఎలైట్ నుంచి తక్కువ ర్యాంకుతో ముందంజ వేసిన జట్టు ప్లేట్ గ్రూప్ టాపర్‌తో ప్రిక్వార్టర్‌ఫైనల్ ఆడుతుంది. ఇందులో గెలిచిన టీమ్ క్వార్టర్స్‌కు వెళ్తుంది. ఎలైట్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు రాజ్ కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, త్రివేండ్రం, ఢిల్లీ, హర్యానా, గౌహతిలో జరుగతాయి. ప్లేట్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లకు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తుంది.