For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు టీమిండియాకి సాయం చేశాడు.. ఇప్పుడు దాల్ పూరి అమ్ముకుంటున్నాడు! హ్యాట్రిక్ తీసినా లాభంలేకపాయే!

Ranji Player Prakash Bhagat Who Bowled To Ganguly In NCA Stint Is Now Selling Dal Puri In Assam

హైదరాబాద్: అదృష్టం కలిసిరాకుంటే కొన్నిసార్లు ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి!. స్టార్ అవుతాననుకున్న వాళ్లు జీరో అవొచ్చు.. జీరో గానే మిగిలిపోతానన్నుకున్న వారు స్టార్ అవొచ్చు. సరిగ్గా ఇవే జరిగాయి అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ ప్రకాశ్ భగత్ విషయంలో. ఒకప్పుడు అతడిని గొప్పగా పొగిడిన నోళ్లే ఆ తర్వాత అతడి ఊసే ఎత్తలేదు. దీంతో అతడి జీవితం పూర్తిగా తలకిందులైంది. క్రికెట్‌లో కనీసం ఒక్కసారి కూడా జాతీయ జట్టులోకి అడుగుపెట్టలేకపోయిన ప్రకాశ్.. తెరమరుగైపోయాడు. చివరకు రోడ్డు పక్కన దాల్ పూరి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

గంగూలీ పిలుపు

గంగూలీ పిలుపు

2003లో న్యూజిలాండ్ పర్యటనకు భారత్ సిద్ధమవుతోంది. కివీస్ జట్టుకు మొదటి నుంచి మంచి బౌలింగ్ దళం ఉండేది. ఆ సమయంలో స్పిన్నర్ డేనియల్ వెటోరి మంచి ఫామ్‌లో ఉన్నాడు. భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌లకి సవాల్ విసిరేలా కనిపించాడు. ఇది భారత జట్టుని కలవరపాటుకి గురిచేసింది. దాంతో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర చర్చలు చేశాడు. చివరకు అస్సాంకి చెందిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రకాశ్ భగత్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) దాదా పిలిపించాడు.

వెటోరీని పోలిన బౌలింగ్ యాక్షన్‌

వెటోరీని పోలిన బౌలింగ్ యాక్షన్‌

ఎన్‌సీఏలో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్.. ప్రకాశ్ భగత్ బౌలింగ్‌లో సాధన చేసేవారు. వీరితో పాటు మరికొందరికి నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. ప్రకాశ్‌ బౌలింగ్‌ యాక్షన్‌.. వెటోరీ బౌలింగ్ యాక్షన్‌ని పోలి ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్లందరూ అతని బౌలింగ్‌లో కఠోర సాధన చేశారు. దీంతో టీమిండియా బ్యాట్స్‌మెన్లు న్యూజిలాండ్ టూర్‌లో డేనియల్ వెటోరీపై బాగా ఆడగలిగారు.

టీమిండియాకు నెట్స్‌లో ఎంతగానో ఉపయోగపడిన ప్రకాశ్.. ఒక్కసారి కూడా జట్టులోకి అడుగుపెట్టలేకపోయాడు. తనతో పాటు అసోంకు ఆడిన క్రికెటర్లు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, తనకు మాత్రం బోర్డు ఎలాంటి సాయం చేయలేదని ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Rashid Khan: అఫ్ఘానిస్థాన్ కెప్టెన్​గా సన్‌రైజర్స్ స్టార్ స్పిన్నర్!!

దాల్ పూరి అమ్ముకుంటూ

దాల్ పూరి అమ్ముకుంటూ

తాజాగా ఓ వెబ్‌సైట్‌కి ప్రకాశ్ భగత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 'అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేసిన క్షణాలను ఎప్పటికి మర్చిపోలేను. దాదాకి ఛాలెంజ్‌ అంటే ఇష్టం. అతనికి బౌలింగ్ చేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. నెట్స్‌లో గంగూలీ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. రోజుకి మూడు పూటలా భోజనం కూడా చేయలేని పరిస్థితి. అస్సాం జట్టుకు అప్పట్లో నాతో కలిసి ఆడిన క్రికెటర్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. కానీ నేను మాత్రం రోజు దాల్ పూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నా' అని 38 ఏళ్ల ప్రకాశ్ భగత్ తెలిపాడు.

హ్యాట్రిక్ కూడా

హ్యాట్రిక్ కూడా

ఎన్‌సీఏలో టీమిండియాకి బౌలింగ్‌ సాయం చేసిన తర్వాత అస్సాం తరఫున మ్యాచ్‌లు ఆడిన ప్రకాశ్ భగత్.. బీహార్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. అస్సాం తరఫున దాదాపు అన్ని స్థాయి క్రికెట్‌లోనూ ఆడిన ప్రకాశ్ భగత్ 2010-11లో చివరిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ప్రకాశ్ తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన పడ్డాయి. సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్నాక దాదా ఏమైనా స్పందిస్తాడో చూడాలి.

Story first published: Wednesday, July 7, 2021, 12:21 [IST]
Other articles published on Jul 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+