Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rashid Khan: అఫ్ఘానిస్థాన్ కెప్టెన్​గా సన్‌రైజర్స్ స్టార్ స్పిన్నర్!!

Rashid Khan appointed Afghanistan T20I captain
#RashidKhan Appointed Afghanistan T20I Captain

కాబూల్‌: స్టార్ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అఫ్ఘానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని రషీద్​ను కెప్టెన్​గా నియమించినట్టు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రషీద్ చేతికి టీ20 టీమ్ పగ్గాలు అందగా.. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది సెలెక్ట్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్లకూ అస్గర్‌ అఫ్ఘాన్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. తనను కెప్టెన్​గా ఎంపిక చేయడంపై రషీద్ హర్షం వ్యక్తం చేశాడు​. దేశానికి సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తానన్నాడు.

'ఎన్నో ఏళ్లుగా రషీద్‌ ఖాన్‌కి ఉన్న అనుభవం, అద్భుత ప్రదర్శన, నాయకత్వ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని అతడికి అఫ్ఘానిస్థాన్‌ టీ20 బాధ్యతలు అప్పగించాం. టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని రషీద్​ను కెప్టెన్​గా నియమించాం. అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ప్రపంచకప్​లో అఫ్ఘానిస్థాన్‌ మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాం' అని ఏసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. రషీద్ అఫ్ఘానిస్థాన్‌ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ2ఓలు ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడుతున్న రషీద్.. ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ టాప్-2లో ఉన్నాడు. ఐపీఎల్‌ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గత కొన్నేళ్లుగా ఆడుతున్న రషీద్ ఎంతో పేరు సంపాదించాడు.

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ ఖాన్‌ని మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. అతని కెప్టెన్సీలో 16 వన్డేలాడిన అఫ్గానిస్థాన్.. ఆరింటిలో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత రషీద్ ఖాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన ఏసీబీ.. అస్గర్ అఫ్గాన్‌ని కెప్టెన్‌గా నియమించింది. అఫ్గాన్‌ సారథ్యంలో కూడా జట్టు పెద్దగా విజయం సాధించలేదు. దాంతో కెప్టెన్సీ విషయంలో ఏసీబీ మల్లగుల్లాలు పడింది. టీ20 పగ్గాలు అందుకునేందుకు ఇటీవల నిరాకరించిన రషీద్ ఖాన్.. ఎట్టకేలకి బోర్డు పెద్దల జోక్యంతో ఓకే చెప్పాడు.

యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబ‌ర్ 17వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు బీసీసీఐ ప్రపంచకప్‌ను నిర్వ‌హించ‌నుంది. భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సం సృష్టించిన నేప‌థ్యంలో టోర్నీ నిర్వహణ వేదిక‌ల‌ను మార్చాల్సి వ‌చ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ప్రపంచకప్‌ మొత్తం జ‌రుగనుంది. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఉన్నాయి. అఫ్గానిస్థాన్ టాప్ జట్లను ఓడించడం కష్టమే.

Story first published: Wednesday, July 7, 2021, 11:19 [IST]
Other articles published on Jul 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+