భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచ కప్‍కు ఐసీసీ సరికొత్త విధానం


న్యూ ఢిల్లీ: భారత్ ఆతిథ్యమివ్వనున్న 2023 ప్రపంచ కప్ కోసం ఐసీసీ సన్నాహాలు మొదలెట్టేసింది. ఈ క్రమంలో పురుషుల వన్డే ప్రపంచకప్‌నకు జట్లు అర్హత సాధించే విధానాన్ని ఐసీసీ సమూలంగా మార్చేసింది. 2023లో భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించే క్రమంలో 3 ఏళ్లలో 32 జట్లు 372 మ్యాచ్‌లు ఆడనున్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పది జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

32 జట్లు పోటీపడవచ్చని తెలిపి
అలాగే 2023 ప్రపంచకప్‌లోనూ పదే జట్లు పాల్గొనే అవకాశం ఇచ్చిన ఐసీసీ.. ఆ పది స్థానాల కోసం 32 జట్లు పోటీపడవచ్చని తెలిపింది. సింగపూర్‌లో ముగిసిన బోర్డు, కమిటీ సమావేశంలో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ వన్డే హోదా పొందిన పన్నెండు దేశాలతో పాటు నెదర్లాండ్స్‌తో కలిపి మొత్తం 13 జట్లు వన్డే అంతర్జాతీయ లీగ్ ఆడతాయి. దాంట్లో నుంచి మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి.
సైనా నెహ్వాల్‌కు తప్పని నిరాశ, టోర్నీ నుంచి ఇంటికి..

వచ్చే ఏడాది జులైలో మొదలై మూడేళ్ల పాటు
మిగిలిన ఐదు జట్లు.. మిగతా 19 ఐసీసీ అసోసియేట్ దేశాలతో కలిసి క్వాలిఫయర్స్ లీగ్ ఆడతాయి. దాంట్లో నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జులైలో మొదలై మూడేళ్ల పాటు కొనసాగుతుంది. క్రికెట్ జట్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నూతన విధానానికి పచ్చజెండా ఊపినట్లు ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపాడు.

'పుట్టింటికి క్రికెట్ తిరిగొస్తోంది
2019 వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకు ఈ వరల్డ్‌కప్ జరగనుంది. ఈ వరల్డ్‌కప్ కోసం లండన్ వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా 'పుట్టింటికి క్రికెట్ తిరిగొస్తోంది' అని ట్యాగ్‌లైన్‌తో ఐసీసీ ఓ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇదే క్యాప్షన్‌తో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

ఐసీసీ విడుదల చేసిన ప్రమోషనల్
సొంతగడ్డపై జరుగనున్న వరల్డ్ కప్ కావడంతో ఇంగ్లాండ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతగా నిలవాలని కలలు కంటోంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఖాతాలో ఇప్పటివరకు ఒక్క వన్డే వరల్డ్ కప్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. 'పుట్టింటికి క్రికెట్ తిరిగొస్తోంది' అనే ట్యాగ్ లైన్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అంచనాలను ఇది మరింతగా పెంచుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications