ఆ సిరీస్ గురించి గంగూలీతో మాట్లాడుతా: రమీజ్ రాజా

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో కలిసి నాలుగు దేశాల వన్డే సిరీస్ గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో మాట్లాడుతానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. ఆస్టేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్ జట్లు కలిసి నాలుగు దేశాల వన్డే సిరీస్‌లో ఆడాలని రమీజ్ రాజా గతంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తద్వారా ఐసీసీలోని సభ్యదేశాల కంటే.. ఈ జట్ల ఆదాయం భారీగా పెరుగుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఆ సిరీస్ గురించి ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో గంగూలీతో చర్చిస్తానని తెలిపాడు. అతను అంగీకరించకుంటే ఇతర దేశాలతో ట్రై సిరీస్ నిర్వహిస్తామని పేర్కొన్నాడు.
'మార్చి 19న దుబాయిలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో.. గంగూలీని కలిసి నాలుగు దేశాల వన్డే సిరీస్ ప్రతిపాదనను వినిపిస్తా. ఒకవేళ అతను మా ఆలోచనతో అంగీకరించకుంటే.. మిగతా దేశాలతో కలిసి ట్రై సిరీస్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం' అని రమీజ్ రజా పేర్కొన్నాడు. రమీజ్ రాజా ప్రతిపాదనను బీసీసీఐ సెక్రటరీ జై షా గతంలోనే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న పాక్‌తో భారత్ సత్సంబంధాలు తెంపుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ పాక్‌తో సిరీస్ ఆడాలన్నా.. బీసీసీఐ భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సిరీస్‌కుక అనుమతి లభించడం చాలా కష్టం.
పాకిస్థాన్‌లో మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు వచ్చే ఏడాది నుంచి మహిళా పీఎస్ఎల్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమీజ్ రజా పేర్కొన్నాడు. 'ప్రస్తుత ఐసీసీ మహిళా ప్రపంచకప్‌లో మా జట్టు విఫలమైంది. అయినా బాధపడటం లేదు. వుమెన్స్ క్రికెట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి మహిళా క్రికెట్‌ను విస్తృతం చేయాలనుకుంటున్నాం. అందుకోసం, వచ్చే జనవరి నుంచి వుమెన్స్ పీఎస్‌ఎల్ నిర్వహించాలనుకుంటున్నాం. విదేశీ క్రీడాకారిణులకు కూడా ఈ టోర్నీలో అవకాశాలిస్తాం. ఐపీఎల్ వేలం తరహాలోనే ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ప్లేయర్ల కోసం బిడ్ వేయొచ్చు. దీని వల్ల ఇటు పీఎస్ఎల్‌కు, అటు ప్లేయర్లకు కూడా భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది' అని రమీజ్ రజా చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications