
ఓవర్‌సీస్ ఆటగాళ్లు క్యూ కడుతారు..
వీదేశీ ఆటగాళ్లంతా పాకిస్థాన్‌కు క్యూ కడతారని, ఐపీఎల్‌ను కాదని మరీ పీఎస్‌ఎల్ ఆడుతారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘ఆర్థికంగా మరింత బలమయ్యేందుకే మేం కొన్ని ఆస్తులను సృష్టించుకోవాలి. ప్రస్తుతం మా వద్ద పీఎస్‌ఎల్, ఐసీసీ నిధుల తప్ప ఏమీ లేవు. వచ్చే ఏడాది జరిగే పీఎస్‌ఎల్‌కు సంబంధించిన విధానంపై ఓ వాదన ఉంది. వచ్చే ఏడాది నుంచి పీఎస్‌ఎల్ వేలం మోడ్‌లోకి మార్చాలనేది నా అభిప్రాయం. ఈ విధానానికి మార్కెట్ అనుకూలంగా ఉంది.

పీసీబీ గౌరవం పెరుగుతోంది..
ఫ్రాంచైజీ యాజమానులతో దీనిపై చర్చిస్తాను. క్రికెట్ డబ్బుల ఆట. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా బలపడితే మనపై గౌరవం రెట్టింపు అవుతుంది. పీసీబీకి ప్రధాన ఆర్థిక వనరు పీఎస్‌ఎల్. ఈ ధనాధన్ లీగ్‌ను వేలం ఫార్మాట్‌లోకి మార్చి, ఫ్రాంచైజీల పర్స్ మనీ పెంచితే ఐపీఎల్ డిమాండ్‌ను తగ్గించవచ్చు. అప్పుడు పీఎస్‌ఎల్‌ను కాదని ఏ విదేశీ ఆటగాడు ఐపీఎల్‌కు వెళ్లలేడు. వచ్చేడాది పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్ తరహాలోనే హోమ్, అండ్ అవే పద్దతిలో నిర్వహించాలనుకుంటున్నాం. అప్పుడు గేట్ మనీ చాలా వస్తుంది.

ఫ్రాంచైజీలకు డబ్బులే డబ్బులు..
ప్రతీ జట్టు పర్స్ పెరుగుతుంది. అయితే ఇదంతా జరగాలంటే ఫ్రాంచైజీలు ముందు మరిన్ని డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెగా వేలం విధానంలో నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభ కలిగిన ఆటగాళ్లంతా అందుబాటులోకి వస్తారు. ఈ విషయంపై ఇప్పటికే నేను పలువురు ఫ్రాంచైజీ ఓనర్లతో మాట్లాడాను. వారంతా ఈ విధానం పట్ల సముఖంగా ఉన్నారు. మరికొందరితో మాట్లాడాల్సి ఉంది. ప్రస్తుతం సంపద్రింపుల దశలో ఉన్నప్పటికీ నా కోరికల లిస్ట్‌లో మాత్రం టాప్‌లో ఉంది'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

భారత ఫ్యాన్స్ సెటైర్స్..
ఇక రమీజ్ రాజా వ్యాఖ్యలపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్ క్రేజ్ గురించి మాట్లాడటం తర్వాత కానీ... ఆటగాళ్లకు జీతాలు సరిగ్గా ఇవ్వండని చురకలంటిస్తున్నారు. అంతేకాకుండా పాక్ పర్యటనకు వచ్చిన ఆటగాళ్లకు సౌకర్యాలు మెరుగుపరచాలని సూచిస్తున్నారు. పీఎస్‌ఎల్‌లో తనకు రావాల్సిన డబ్బులు చెల్లించలేదంటూ.. ఆసీస్ ప్లేయర్ జేమ్స్ ఫాల్కనర్ లీగ్ మధ్యలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇక టెస్ట్ సిరీస్ ఆడుతున్న మార్నస్ లబుషేన్.. తనకు నాణ్యత లేని ఆహారం పెట్టారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. పీఎస్‌ఎల్‌లో తనకు కుళ్లిపోయిన ఎగ్ ఇచ్చారని అలెక్స్ క్యారీ ఆరోపించాడు. వీటన్నిటిని సరిచేసుకోవాలని భారత అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు.


Click it and Unblock the Notifications












