ఏమిరా మీవల్ల ఉపయోగం? పాకిస్థాన్ ఘోర పరాజయంపై రమీజ్ రాజా ఫైర్!
ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించాడు. పాకిస్థాన్ ఆటతీరుకు అభిమానులు ఎప్పుడో విసుగు చెందారని, ఎవరి కోసం సుదీర్ఘ ఫార్మాట్ ఆడుతున్నారని విమర్శలు గుప్పించాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్.. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో పాకిస్థాన్ కనీసం 200 పరుగులు చేయలేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే తొలి వికెట్ కోల్పోయి చెత్త రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకుంది.
అభిమానులు విసుగు చెందారు..
ఈ ఘోర పరాజయంపై స్పందించిన రమీజ్ రాజా.. పాకిస్థాన్ జట్టుతో పాటు సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. కొన్ని మైదానాల్లో మాత్రమే గెలవగల ఏకపక్ష జట్టును సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారని మండిపడ్డాడు. 'పాకిస్థాన్ జట్టుకు ప్రధాన పిల్లర్ అయిన ఫ్యాన్స్ ఎప్పుడో దూరమయ్యారు. పాకిస్థాన్ ఆటతీరుకు వారు విసుగుచెందారు. వారు ఈ జట్టుకు అస్సలు మద్దతు ఇవ్వరు. గత 20 టెస్ట్‌ల్లో 17 మ్యాచ్‌లు ఓడిన జట్టుకు అభిమానులు ఎలా మద్దతు ఇవ్వగలరు? సెలెక్టర్లు కేవలం కొన్ని మైదానాల్లో మాత్రమే గెలవగల ఏకపక్ష జట్టును ఎంపిక చేస్తున్నారు?

ఏకపక్ష జట్లతో నాశనం..
పాకిస్థాన్‌లో స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్‌లను తయారు చేయడంపై మాత్రమే ఫోకస్ పెట్టారు. దాంతో పేస్ బౌలింగ్‌ను పూర్తిగా విస్మరిస్తున్నారు. చాలా మంది ఆటగాళ్లు టీ20 మ్యాచ్‌లు ఆడటానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పొట్టిఫార్మాట్‌లో సునాయసంగా విజయాలు లభిస్తాయి. వారికి టెస్ట్ క్రికెట్ ఆడటంపై ఏ మాత్రం ఆసక్తి లేదు.
పాకిస్థాన్ జట్టు ప్రధాన బలమే ఫాస్ట్ బౌలింగ్. దాన్నే విస్మరిస్తే టెస్ట్ క్రికెట్ ఎందుకు ఆడాలి? ఫాస్ట్ బౌలర్లను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే పాకిస్థాన్ క్రికెట్ తిరిగి పుంజుకోగలదు.'అని రమీజ్ రజా ఓ టీవీ షోలో చెప్పుకొచ్చాడు.
1980, 1990లో పాకిస్థాన్ నెంబర్ వన్ టెస్ట్ టీమ్‌గా కొనసాగింది. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్లు ఇంగ్లండ్ గడ్డపై వరుసగా మూడు టెస్ట్ సిరీస్‌లను గెలుచుకున్నాయి. కానీ ఇప్పుడు సిరీస్ దేవుడెరుగు ఒక మ్యాచ్ డ్రా చేసుకుంటే గొప్ప అనే పరిస్థితికి పాకిస్థాన్ ప్రదర్శన దిగజారింది.
చెత్త బ్యాటింగ్‌తో..
ఈ తొలి టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇమామ్ ఉల్ హక్(42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/51), జోష్ టంగ్(5/46) ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోర్డాన్ కాక్స్(73), కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), డాన్ లారెన్స్ సత్తా చాటారు.
పాక్ బౌలర్లలో అలి ఉస్మాన్(5/95) ఐదు వికెట్లు తీయగా.. ఖుర్రమ్ షెహ్‌జాద్(3/133) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు. 238 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 135 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. షాన్ మసూద్(29), మహమ్మద్ రిజ్వాన్(41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
