Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా గెలుపు క్రెడిట్‌ రవిశాస్త్రికే.. ఎందుకంటే?: పాక్ మాజీ క్రికెటర్

Rameez Raja credits Ravi Shastri for Indias Success in Australia Test Series

కరాచీ: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భారత్ విజయంలో హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికే ఎక్కువ క్రెడిట్‌ ఇస్తానని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ రమిజ్ ‌రాజా అన్నారు. క్లిష్టపరిస్థితుల్లో స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా జట్టును ముందుకు తీసుకెళ్లాడని కొనియాడారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో ప్రతి ఒక్కర్నీ సరైన రీతిలో తీర్చిదిద్దాడని పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన గబ్బా టెస్టులో భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించి.. కంగారు గడ్డపై 2-1 తేడాతో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

క్రెడిట్‌ రవిశాస్త్రికి ఇస్తా:

క్రెడిట్‌ రవిశాస్త్రికి ఇస్తా:

తాజాగా రమిజ్ ‌రాజా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ... 'అడిలైడ్‌లో భారత్‌ ఘోర పరాభవం పాలైన తర్వాత 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడం విశేషం. ఈ విజయంలో ఎక్కవ క్రెడిట్‌ కోచ్‌ రవిశాస్త్రికి ఇస్తా. ఎందుకంటే.. క్లిష్టపరిస్థితుల్లో స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి రగిల్చాడు. అలాగే ఏ జట్టుకూ తీసిపోమనే భావన డ్రెస్సింగ్‌ రూమ్‌లో కలిగించడం, ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులను వివరించడం అంత తేలికకాదు' అని అన్నాడు.

కోహ్లీ పోరాడే కసిని పెంచాడు:

కోహ్లీ పోరాడే కసిని పెంచాడు:

'టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అంటే నాకెంతో ఇష్టం. జట్టులో ప్రతి ఒక్కర్నీ సరైన రీతిలో తీర్చిదిద్దాడు. ఆటగాళ్లలో పోరాడే కసిని, దూకుడును పెంచాడు. ప్రస్తుత టీమ్‌లో అతడి పాత్ర చాలా ఉంది. అడిలైడ్‌లో భారత్ 36 పరుగులకే ఆలౌటయ్యాక అజింక్య రహానే జట్టుకెంతో అవసరమయ్యాడు. ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు నడిపించాడు. అతడు అద్భుతంగా పనిచేశాడు. గబ్బా టెస్టులో చివరి రోజు భారత్ పోరాటం అద్భుతం. యువ ఆటగాళ్లు సత్తాచారు' అని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్ ప్రశంసించారు.

ద్రవిడ్‌ ముఖ్య భూమిక పోషించాడు:

ద్రవిడ్‌ ముఖ్య భూమిక పోషించాడు:

ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ గెలవడంలో టీమిండియా మాజీ కెప్టెన్, న్‌సీఏ డైరెక్టర్ రాహుల్‌ ద్రవిడ్‌ ముఖ్య భూమిక పోషించాడని టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే అన్నాడు. 'ద్రవిడ్‌ లాంటి వ్యక్తి ఉంటే రోజూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అతను భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లాక్‌డౌన్‌కు ముందు మేం ఎన్‌సీఏకు వెళ్లేవాళ్లం. ఆయన నుంచి నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇంతకుముందు అండర్‌-19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్‌ నేతృత్వంలోనే సిరాజ్‌, సైనీ, మయాంక్‌, శుభ్‌మన్‌ లాంటి ఆటగాళ్లు తయారయ్యారు' అని చెప్పుకొచ్చారు.

ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధం:

ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధం:

ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టును ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. చెన్నైలో శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బయోబబుల్‌లో క్వారంటైన్‌ పూర్తి కావడం, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సన్నాహాలకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి భారత్‌, ఇంగ్లిష్‌ జట్ల ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు దిగనున్నారు. సుదీర్ఘ పర్యటనలో భారత్‌-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి.

వైరల్ వీడియో.. 'మాస్టర్'‌ సినిమా పాటకు ఆటగాళ్ల స్టెప్పులు!! (వీడియో)

Story first published: Tuesday, February 2, 2021, 9:50 [IST]
Other articles published on Feb 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+