Ramandeep Singh: ఎవడ్రా వీడు? కెరీర్ ఫస్ట్ బాలే సిక్స్ కొట్టాడు!(వీడియో)
టీమిండియా అరంగేట్ర ప్లేయర్ రమణ్ దీప్ సింగ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రమణ్‌దీప్ సింగ్.. చివర్లో బ్యాటింగ్‌కు దిగి 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. క్రీజులోకి వచ్చి రాగానే రమణ్ దీప్ సింగ్ సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఏం గుండెరా అది..?
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే సిక్సర్‌గా మలిచాడు. సిమలనె వేసిన 18వ ఓవర్‌లో రింకూ సింగ్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన రమణ్‌దీప్ సింగ్.. తాను ఆడిన మొదటి బంతినే మిడాన్ దిశగా సిక్సర్ బాదాడు. రమణ్‌దీప్ సింగ్ సిక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'ఎవడ్రా వీడు ఫస్ట్ బాల్‌నే సిక్సర్ కొట్టాడు', 'ఏం గుండెరా అది కెరీర్‌లో ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఎవరీ రమణ్‌దీప్ సింగ్..?
పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన రమణ్‌దీప్ సింగ్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన రమణ్‌దీప్ సింగ్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 45 పరుగులతో పాటు 6 వికెట్లు తీసాడు.
ఐపీఎల్ 2023 మెగా వేలంలో కేకేఆర్ అతన్ని రూ. 20 లక్షలకు తీసుకోగా.. అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బిగ్ హిట్టర్‌గా కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్-ఏ తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో అతన్ని కేకేఆర్ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.
నిలకడైన ఆటతో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం, అద్భుతమైన ఫీల్డర్ కావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ రమణ్‌దీప్ సింగ్‌కు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
తిలక్ శతకం...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ(56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications