టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర న్యూస్ వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ బయోపిక్‌ను నిర్మించేందుకు బాలీవుడ్‌కు చెందిన ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో విరాట్ కోహ్లీ పాత్రను టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తారని, అతి త్వరలోనే ఈ బయోపిక్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
అయితే గతంలోనే ఈ వార్తలు చక్కర్లు కొట్టగా.. రామ్ చరణ్ టీమ్ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కోహ్లీ బయోపిక్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. అయినా ఈ వార్తలకు బ్రేక్ పడటం లేదు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ బయోపిక్ వార్త వైరల్‌గా మారింది.

ఒకవేళ కోహ్లీ బయోపిక్ తీసినా.. తన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సాయంతో అతనే తన పాత్రను పోషిస్తాడని, కోహ్లీకి కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని అతని ఫ్యాన్స్ అంటున్నారు. తమ బయోపిక్‌ను అనుష్క శర్మనే నిర్మిస్తుందని, ఇతరులకు ఎందుకు అవకాశం ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాతే విరాట్ కోహ్లీ బయోపిక్ వచ్చే అవకాశం ఉంది. మంగళవారం(నవంబర్ 5)తో కోహ్లీ 36వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సహచర, మాజీ క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు.
న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 93 పరుగులే చేశాడు. కోహ్లీ, రోహిత్ వైఫల్యం కారణంగా టీమిండియా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీతో పాటు ఇతర సీనియర్లు సత్తా చాటితేనే జట్టులో కొనసాగుతారు.లేకుంటే సీనియర్లను పక్కనపెడుతారని ఇప్పటికే బీసీసీఐ వర్గాలు తెలిపాయి.