Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ వద్దు: కోహ్లీ చిన్ననాటి కోచ్

ఓవైపు టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు ఖారారు అయినట్లు వార్తలు వస్తుండగా.. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మహేంద్ర సింగ్ ధోనీని కోచ్‌గా నియమించాలని ప్రతిపాదించాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది.

ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా.. సోమవారంతో ఆ గడువు ముగిసింది. మొత్తం 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా వరకు ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయని, భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సచిన్ టెండూల్కర్, ధోనీ పేరిట అప్లికేషన్స్ వచ్చాయని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.

Rajkumar Sharma says MS Dhoni is the Best pick as Team India s Head coach

ఇక టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు అయిందని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తెలిపాడు. అయితే విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ మాత్రం మహేంద్ర సింగ్ ధోనీని హెడ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐకి సూచించాడు.

'టీమిండియా హెడ్ కోచ్ పదవికి మహేంద్ర సింగ్ ధోనీ సరైనోడు. అతను చాలా క్రికెట్ ఆడటంతో పాటు కెప్టెన్‌గా పెద్ద టోర్నీలను గెలిచాడు. ధోనీ అంటే ప్రస్తుత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతీ ఒక్కరికి గౌరవమే. అతని మాటకు ప్రతీ ఆటగాడు విలువ ఇస్తాడు.

Rajkumar Sharma says MS Dhoni is the Best pick as Team India s Head coach

టీ20 ఫార్మాట్‌లో ధోనీ సుదీర్ఘ కాలం ఆడాడు. ఈ అనుభవంతో జట్టుకు కావాల్సిన సరైన నిర్ణయాలు తీసుకోగలడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. 'అని రాజ్‌కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2021 సమయంలో ధోనీ టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఆ టోర్నీలో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.

Story first published: Tuesday, May 28, 2024, 19:19 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+