ఎవరూ వచ్చినా రాకపోయినా ఐపీఎల్ ఆగదు: రాజీవ్ శుక్లా

న్యూఢిల్లీ: ఎవరూ వచ్చినా రాకపోయినా ప్రణాళికల ప్రకారమే ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అన్నాడు. కరోనాతో ఆగిపోయిన ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను యూఈఏ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్య లీగ్ పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
అయితే ఈ టైమ్‌లో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆయా దేశాల బీజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ వల్ల స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. దాంతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

లీగ్ పూర్తి చేయడమే..
అయితే వచ్చిన వాళ్లతోనే లీగ్ పూర్తి చేస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా.. రాజీవ్ శుక్లా సైతం మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌ల ఏర్పాటు కోసం యూఏఈ వెళ్లిన రాజీవ్ శుక్లా.. అక్కడి ప్రముఖ పత్రిక ఖలీజ్ టైమ్స్‌తో మాట్లాడారు. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా యూఏఈ రానున్నట్లు తెలిపాడు. అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్ల ప్లేస్‌లో ఇతర ఆటగాళ్లను తీసుకునేలా ఫ్రాంచైజీలకు అవకాశం కల్పిస్తామని చెప్పాడు. ఎవరి కోసం లీగ్ ఆపమని స్పష్టం చేశాడు.

వచ్చిన వారితోనే..
'గత శనివారం జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే విషయంపై చర్చించాం. అయితే మా ప్రధాన దృష్టంతా లీగ్‌ను పూర్తి చేయడంపైనే ఉంది. లీగ్‌ను సగంలోనే వదిలేయడం బాగుండదు కాబట్టి అందుబాటులో ఉన్న ఫారిన్ ప్లేయర్లతోనే సరిపెట్టుకుంటాం. రాని వారి కోసం లీగ్‌ను ఆపలేం. భారత ఆటగాళ్లు, ఫారీన్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారు. కానీ కొంతమందే అందుబాటులో ఉండకపోవచ్చు. వారి స్థానాల్లో అందుబాటులో ఉండే ఇతరులను తీసుకునేలా ఫ్రాంచైజీలకు అవకాశం కల్పిస్తాం. వారితోనే లీగ్‌ను పూర్తి చేస్తాం. అదే మా పాలసీ.'అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు.

సెప్టెంబర్ 18న షురూ..
యూకే వేదికగా సెకండాఫ్ నిర్వహిస్తారని జరిగిన ప్రచారాన్ని శుక్లా దృష్టికి తీసుకెళ్లగా.. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగానే వెనకడుగు వేసామన్నాడు. సెప్టెంబర్-అక్టోబర్‌లో ఇంగ్లండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపాడు. ఇక స్టేడియాల్లో అభిమానులకు అనుమతి ఇస్తారా లేదా అన్న ప్రశ్నకు అది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చేతుల్లో ఉన్నదని స్పష్టం చేశాడు.
అనుమతించినా, లేకపోయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత (సెప్టెంబర్ 18న) ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాల ఉన్నట్లు తెలిపాడు. టోర్నీ ప్రారంభానికి ముందే ప్లేయర్స్ అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామనీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications