Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలుపు కంటే ఆ లక్ష్యంతోనే బ్యాటింగ్ చేశాం: రజత్ పాటిదార్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)పై విజయం సాధించడం కంటే టాప్ ప్లేస్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-5 బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని తమ ముందు ఉంచారని చెప్పాడు. బౌలింగ్‌లో స్లోయర్ బౌన్సర్లు, యార్కర్లతో తమను కట్టడి చేశారని ప్రశంసించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 55 పరుగుల భారీ తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ తమ అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకొని క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.

IPL 2026: ముంబై, సీఎస్‌కే ఔట్.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందంటే?

IPL 2026: ముంబై, సీఎస్‌కే ఔట్.. గతంలో ఇలా ఎప్పుడు జరిగిందంటే?

భారీ స్కోర్ చేశారు..

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రజత్ పాటిదార్.. 255 పరుగులు సమర్పించుకున్నప్పుడే తమ ఓటమి ఖాయమైందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఏం మారకున్నా.. స్లోయర్ బౌన్సర్లు ఆడటం చాలా కష్టమైందని తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. వారి టాప్-5 బ్యాటర్లు చాలా బాగా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో వారు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

Rajat Patidar Says Top Priority Was to Be on Top After RCB Secure No 1 Spot Despite Defeat Against SRH

రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఏ మాత్రం స్లోగా మారలేదు. కానీ స్లో బౌన్సర్లు వేసినప్పుడు బౌలర్లకు సహకారం లభించినట్లు అనిపించింది. SRH బౌలింగ్ బలం కూడా స్లో బౌన్సర్లు, యార్కర్లు వేయడమే. ఈ మ్యాచ్‌లో వారు ఆ ప్లాన్స్‌ను చాలా అద్భుతంగా అమలు చేశారు.

గెలుపు కంటే టేబుల్ టాపర్‌గా..

ఈ మ్యాచ్ గెలుపు కంటే.. పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవడమే మా తొలి ప్రాధాన్యత. కానీ తొలి ఇన్నింగ్స్‌లోనే చాలా ఎక్కువ పరుగులు ఇచ్చేశాం. ఈ పిచ్‌పై 255 పరుగులు అనేది చాలా పెద్ద స్కోరు. ఆపై వారి ఐదుగురు బౌలర్లు స్లో బౌన్సర్లు, యార్కర్లను చాలా పర్ఫెక్ట్‌గా వేశారు.

వాటిని బౌండరీలకు తరలించడం కష్టమైంది. సాధారణంగా హైదరాబాద్ వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుంటుంది. కానీ బౌలర్లు పిచ్‌ను వాడుకుంటూ స్లో బౌన్సర్లు వేయడంతో పరుగులు చేయడం, భారీ షాట్లు కొట్టడం చాలా కష్టంగా మారింది'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

పరుగుల విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆర్‌సీబీ బౌలరలో రసీక్ సలామ్(2/55) రెండు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ(1/36), కృనాల్ పాండ్యా(1/24) చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/33) రెండు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లకు తలో వికెట్ దక్కింది.

వారి వల్లే టాప్-2 ప్లేస్‌ చేజారింది: ప్యాట్ కమిన్స్

వారి వల్లే టాప్-2 ప్లేస్‌ చేజారింది: ప్యాట్ కమిన్స్
Story first published: Saturday, May 23, 2026, 0:50 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+