Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rajat Patidar: ఈ క్రికెట్ గ్రికెట్ మనకు సెట్ కాదు.. సక్కగ మన పైపుల బిజినెస్ చూసుకో!

Rajat Patidars Family Wanted Him to Take Over Their Manufacturers of Pipes Business

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీ ద్వారా మరో భారత యువ కెరటం క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. తాజా సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ ప్లేయర్ రజత్ పటీదార్ అజేయ శతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. లక్నోసూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి అద్భుత విజయాన్నందించాడు. గత రెండేళ్లుగా ఆర్‌సీబీకి గండంలా మారిన ఎలిమినేటర్‌ను సూపర్ బ్యాటింగ్‌తో ధాటించాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో స్టార్ ఆటగాడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే రజత్ పటీదార్ ఫ్యామిలీకి అతను క్రికెటర్ కావడం ఏ మాత్రం ఇష్టం లేదట.

పైపుల బిజినెస్ చూసుకోమని..

పైపుల బిజినెస్ చూసుకోమని..

అతని ఫ్యామిలీకి ఇరిగేషన్ పైపుల తయారీ కంపెనీ ఉంది. ఆ వ్యాపారాన్నే రజత్ చూసుకోవాలని వారు భావించారట. ఈ క్రికెట్ గ్రికెట్ మనకు సెట్ కాదు.. సక్కగ మన పైపుల బిజినెస్ చూసుకోమని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. కానీ వ్యాపారం కన్నా తనకు క్రికెట్ అంటేనే ఇష్టమని పటీదార్ మంకు పట్టు పట్టడంతో నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో అని వదిలేసారట. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటడంతో అతని కుటుంబానికి పటీదార్‌పై నమ్మకం కలిగింది. దాంతో అతన్ని ప్రోత్సహించారు. రజత్ పటీదార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని డొమెస్టిక్ క్రికెట్‌మేట్, మధ్యప్రదేశ్ సీనియర్ ప్లేయర్ ఈశ్వర్ పాండే మీడియాతో పంచుకున్నాడు.

ఆర్‌సీబీ హనుమంతుడు..

ఆర్‌సీబీ హనుమంతుడు..

'రజత్ అంటే సమస్యకు పరిష్కారం చూపేవాడు. హనుమంతుడికి మరో పేరు. అతను లక్నోపై ఆడినటువంటి ఇన్నింగ్స్‌లు గతంలోనే ఆడాడు. కానీ అవి టీవీలో రాలేదు. అందుకే ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు. కానీ లక్నోతో సూపర్ సెంచరీతో చెలరేగిన పటీదార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. సూపర్ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ హనుమాన్‌గా మారాడు. రంజీట్రోఫీలో మహమ్మద్ షమీ, అశోక్ దిండా వంటి బౌలర్లను పటీదార్ చెడుగుడు ఆడాడు. అతను సక్సెస్ సాధిస్తాడని మేం ఎప్పుడో ఊహించాం. కొంత ఆలస్యమైనా అతను తన సత్తా చాటాడు'అని ఈశ్వర్ పాండే చెప్పుకొచ్చాడు.

మధ్యప్రదేశ్ తరఫున ఎన్నో..

మధ్యప్రదేశ్ తరఫున ఎన్నో..

ఇక బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన పటీదార్ అండర్ 15 లెవల్‌ వరకు అలానే కొనసాగాడు. కానీ ఆ తర్వాత ముంబై మాజీ క్రికెటర్ ఆమే ఖురాసియా సాయంతో బ్యాటర్‌గా మారాడు. మొకాలి సర్జరీ అయినా కూడా కోలుకొని మరింత బలంగా పునరాగమనం చేశాడు. 2015లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పటీదార్.. మధ్యప్రదేశ్ జట్టులో కీలక ప్లేయర్. ఆర్‌సీబీ తరఫున బుధవారం ఆడినటు వంటి ఇన్నింగ్స్‌లను మధ్య ప్రదేశ్ తరఫున ఎన్నో ఆడాడు.

సిసోడియా గాయంతో..

సిసోడియా గాయంతో..

ఇప్పటికే అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏడు సెంచరీలు, డొమెస్టిక్ వన్డేల్లో మూడు శతకాలు బాదాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో 50 ప్లస్ రన్స్ చేశాడు. అయితే ఈ సీజన్ మెగావేలంలో అమ్ముడుపోని జాబితాలో నిలిచిన రజత్.. అదృష్టవశాత్తు లువ్‌నిత్ సిసోడియా గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చాడు. వేలం జరిగిన నెల తర్వాత సంజయ్ బంగర్ ఫోన్‌తో జట్టులో చేరిన రజత్.. ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్నందించాడు.

Story first published: Thursday, May 26, 2022, 12:25 [IST]
Other articles published on May 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+