Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK: అందుకే జోష్ హజెల్ వుడ్ ఆడటం లేదు: రజత్ పటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వచ్చే సీజన్ కోసం ఈ నాలుగు మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఏ ఆటగాడు ఏ రోల్‌కు సరిపోతాడో పరిశీలించాలనుకుంటున్నాం. ఈ నాలుగు మ్యాచ్‌లు గెలవాలనుంది. కానీ ఈ నాలుగు మ్యాచ్‌లను మాకు అడ్వాంటేజ్‌గా మార్చుకోవాలనుకుంటున్నాం.

ఈ పిచ్ కాస్త ట్రిక్కీగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా కవర్స్ కింద ఉంది. అంతేకాకుండా ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే హైస్కోరింగ్ వేదిక. శుభారంభం దక్కితే భారీ స్కోర్ చేయవచ్చు. దూకుడుగా ఆడాలి. కానీ బ్యాటర్లను తమ బలాలను మాత్రమే నమ్ముకోవాలి. బౌలర్లు ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయాలి. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

Rajat Patidar Reveals The Reason Why Josh Hazlewood Not Playing in RCB vs CSK IPL 2025 Match
Photo Credit: IPL (X)

మరోవైపు బెంగళూరు వేదికగా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ టాస్ ఓడిపోయాడు. అయితే టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అతను తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. అయితే వికెట్‌లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. మేం మంచి లక్ష్యాన్ని నమోదు చేసి, చెన్నైని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలపై క్లారిటీతో ఉన్నారు. ఓ కెప్టెన్‌గా మా ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది.

ఇప్పటికే మా జట్టు తరఫున చాలా మంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఇది మాకు శుభసూచకం. మేం ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లను గెలిచే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్‌పై ఫోకస్ పెట్టలేదు. మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. జోష్ హజెల్ వుడ్ స్థానంలో లుంగి ఎంగిడికి అవకాశం ఇచ్చాం.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు. హజెల్ వుడ్ ఆడకపోవడానికి గల కారణాన్ని రజత్ పటీదార్ వెల్లడించలేదు. ఆర్‌సీబీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చినట్లు అర్థమవుతోంది.

తుది జట్లు:
ఆర్‌సీబీ: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, యశ్ దయాల్

చెన్నై సూపర్ కింగ్స్: షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా,ఎంఎస్ ధోనీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా.

Story first published: Saturday, May 3, 2025, 19:33 [IST]
Other articles published on May 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+