Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్‌సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్!

ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తమ కొత్త సారథిగా రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడుతాడని భావించినా.. అతను నిరాకరించడంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా రజత్ పాటిదార్ తమ కొత్త కెప్టెన్ అని ప్రకటించింది.

విరాట్ కోహ్లీ అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. అతను ఐపీఎల్ 2024 సీజన్ వరకు జట్టులో కొనసాగాడు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ అతన్ని వేలంలోకి వదిలేసింది. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్‌సీబీకి ఏర్పడింది.

Rajat Patidar Named New RCB Captain For IPL 2025

సీనియర్లను కాదని..
జట్టులో కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లున్నా.. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ రజత్ పాటిదార్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2021లో అనూహ్యంగా ఆర్‌సీబీలోకి వచ్చిన రజత్ పాటిదార్ ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌గా మారాడు. ఆర్‌సీబీ తరఫున అద్భుత ప్రదర్శనతో గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

ఇప్పటి వరకు మూడు టెస్ట్‌లు, ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అతనికి అవకాశం దక్కలేదు. ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన 8వ ప్లేయర్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. 8 మంది కెప్లెన్లు మారినా ఆర్‌సీబీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. 2009, 2016 సీజన్లలో ఫైనల్ చేరిన ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

ఆర్‌సీబీ కెప్టెన్ల జాబితా ఇదే..

1.రాహుల్ ద్రవిడ్(2008)

2. కెవిన్ పీటర్సన్(2009) (తాత్కలిక సారథి)

3. అనిల్ కుంబ్లే (2009-10)

4. డానియల్ వెటోరీ: 2011-12

5. విరాట్ కోహ్లీ 2011-2021, 2023(స్టాండ్ ఇన్ కెప్టెన్)

6. షేన్ వాట్సన్: 2017(తాత్కలిక సారథి)

7. ఫాఫ్ డుప్లెసిస్: 2022-24

Take a Poll
Story first published: Thursday, February 13, 2025, 12:55 [IST]
Other articles published on Feb 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+