Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్ కాదు.. ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: రజత్ పాటిదార్

బ్యాటింగ్‌ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. 15-20 పరుగుల అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. అయినప్పటికీ తమ బౌలర్లు మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లారని కొనియాడాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 175 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలోనే ఛేదించి చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది. డేవిడ్ మిల్లర్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో వరుసగా 6,6,4 బాది మరో బంతి మిగిలి ఉండగానే మిల్లర్ మ్యాచ్‌ను ముగించాడు.

వరుసగా వికెట్లు కోల్పోవడం..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ కూడా చాలా నెమ్మదిగా ఉందని తెలిపాడు. 'మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. కానీ మేం 15-20 పరుగులు తక్కువగా చేశాం. మేం మా ఇన్నింగ్స్ ఆరంభించిన విధానానికి భారీ స్కోర్ చేయాల్సింది. ముఖ్యంగా విరాట్ భాయ్, సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కానీ 12-13 ఓవర్ల తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది.

IPL 2026 Rajat Patidar Laments Batting Collapse as RCB Falls Short Against Delhi Capitals

తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. తక్కువ స్కోర్ చేసినా.. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లడం మాకు ఒక సానుకూల సంకేతం. బౌలర్లు ఏం చేసినా క్లారిటీతో ఉండాలని నేను వారికి చెబుతుంటాను. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం తిరిగి వెళ్లి ఎక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకుంటాం. వాటిని సరిదిద్దుకుంటాం.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. టీమ్ డేవిడ్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) పర్వాలేదనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ట్రిస్టన్ స్టబ్స్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్(18 బంతుల్లో 3 ఫోర్లతో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/26) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, April 18, 2026, 20:22 [IST]
Other articles published on Apr 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+