టీమ్ డేవిడ్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు జట్టు సమష్టి కృషితోనే భారీ విజయం దక్కిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఆరంభం అందిస్తే.. టీమ్ డేవిడ్ అసాధారణమైన ముంగింపు అందించాడని తెలిపాడు. తమ బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చి గొప్ప విజయాన్ని అందించారని కొనియాడాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 43 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్ టీమ్ డేవిడ్‌తో పాటు తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. టీమ్ డేవిడ్ అత్యుత్తమ ఫినిషర్ అని కొనియాడాడు.
'ఈ విజయం గొప్పగా అనిపిస్తోంది. మంచి క్రికెట్ ఆడి గెలిచినప్పుడు జట్టులో ఎంతో సంతృప్తి కనిపిస్తుంది. మ్యాచ్ ఆరంభంలో బంతి కొంచెం ఆగి వచ్చింది. విరాట్ భాయ్, ఫిల్ సాల్ట్ ఆడిన తీరు అమోఘం. ఆ తర్వాత మ్యాచ్ మలుపు తిరిగిన విధానం అద్భుతం. డగౌట్ నుంచి నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి మా బ్యాటర్ల సిక్సర్లను ఆస్వాదించాను. నేను క్రీజులో ఉన్నంత వరకు బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాను.

టీమ్ డేవిడ్ స్పెషలిస్ట్ ఫినిషర్. అతను అత్యుత్త ఫినిషర్లలో ఒకడు. అతని బ్యాటింగ్‌ను చాలా ఆస్వాదించాను. గతేడాది కూడా అతను ఇలాగే ఆడాడు. నిలకడగా ఆడే అత్యుత్తమ ఫినిషర్. నేను చూసిన అత్యుత్తమ ఫినిషర్ అతనే. మా బౌలింగ్ గురించి ఎంత చెప్పి తక్కువే. డఫ్పీ తన ఆఫ్ ఫింగర్ బాల్స్‌తో వికెట్లు తీసిన తీరు మమ్మల్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత కృనాల్ కీలకమైన బ్రేక్ త్రూ అందించాడు.
డెత్ ఓవర్లలో భువీ, అభినందన్ వేసిన యార్కర్లు అమోఘం. మధ్యలో రొమారియో వేసి ఒక్క ఓవర్ అద్భుతం. సుయాష్ నాలుగు ఓవర్లను కట్టడిగా వేసాడు. నేను ఎప్పుడు ఒత్తిడిలో ఉన్నా.. 'కృనాల్ పాండ్యా ఎక్కడ ఉన్నాడు?' అని చూస్తాను. అతనిపై నాకు అంత నమ్మకం ఉంది. ప్రస్తుతం జట్టులో అందరూ మంచి మైండ్‌సెట్‌తో ఉన్నారు. తర్వాతి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.