
ఒక్క పరుగుతో..
2016 సీజన్‌లో పుణెను నడిపించిన ధోనీ.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తదుపరి సీజన్‌లో అతనిపై వేటు వేసి స్టీవ్ స్మిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక ఆ సీజన్‌లో పుణె ఫైనల్ చేరింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములతో ప్లేఆఫ్స్‌కు చేరగా అక్కడి నుంచి ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో తలపడింది. ఈ నేపథ్యంలోనే ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 129/8 స్వల్ప స్కోరే నమోదు చేసినా పుణె 128/6కే పరిమితమైంది.

స్మిత్‌కు ధోనీతో పోలికా..?
అయితే, అప్పుడు తమ జట్టు ఫైనల్ చేరడానికి ధోనీ కారణమని తాజాగా రజత్ స్పష్టం చేశాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 'స్టీవ్‌స్మిత్‌ను మీరెప్పుడూ ధోనీతో పోల్చిచూడకూడదు. నా దృష్టిలో టాప్ 10 కెప్టెన్ల జాబితాలోనూ స్మిత్ ఉండడు. మేం 2017లో ఫైనల్‌కు చేరడంలో ధోనీ పాత్ర కీలకం. అలాగే రాజస్థాన్ రాయల్స్ గతేడాది స్మిత్‌ను కెప్టెన్‌గా చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు' అని ఈ మాజీ ఐపీఎల్ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.

ఏప్రిల్ 10న..
ఇదిలా ఉండగా 2017తో నిషేధం పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరుసటి ఏడాది వచ్చీ రావడంతోనే టైటిల్ సాధించింది. దాంతో మూడోసారి ఐపీఎల్లో ట్రోఫీ నెగ్గిన జట్టుగా నిలిచింది. ఇక గతేడాది మరీ ఘోరమైన ప్రదర్శన చేసిన చెన్నై వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 కోసం సమయాత్తం అవుతోంది. సురేశ్ రైనా జట్టులోకి తిరిగిరాగా.. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications












