Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: రూ.15, 300 కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్! కొన్నది ఎవరంటే..?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నమై.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేతులు మారింది. అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టులోని 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. దాదాపు రూ.15,300 కోట్ల(1.63 బిలియన్ డాలర్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతి పెద్దగా డీల్‌ అని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

కల్ సోమానీతో పాటు..

కల్ సోమానీతో పాటు వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్, అలాగే హాంప్ కుటుంబం ఈ కొనుగోలు కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీమ్ యాజమాన్యం అధికారికంగా వీరి చేతుల్లోకి వెళ్లనుంది.

Rajasthan Royals Sold for Record 1 63 Billion to Kal Somani-Led US Consortium ahead of IPL 2026

గతంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో 65 శాతం వాటాను ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలే కలిగి ఉండగా.. మిగిలిన 35 శాతాన్ని రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, లాచ్‌లాన్ మర్డోక్ పంచుకున్నారు. ఈ వాటా విక్రయ ప్రక్రియ గత ఏడాది చివరిలో ప్రారంభమైంది. ది రెయిన్ గ్రూపు పెట్టుబడి బ్యాంక్ సలహాదారుగా వ్యవహరించింది. ఆదిత్య బిర్లా గ్రూపు వంటి దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపినప్పటికీ, సోమానీ కన్సార్టియం ముందంజలో ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. గతంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలోని 67 శాతం వాటాను సీవీసీ క్యాపిటల్ రూ.5,025 కోట్లకు టోరెంట్ గ్రూప్‌కు అమ్ముకుంది.

ఎవరీ కల్ సోమానీ..?

కల్ సోమానీ అరిజోనాకు చెందిన ఓ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎడ్యుటెక్, డేటా సీక్రెసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ టెక్ రంగాలలో ఆయనకు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి అనేక టెక్ సర్వీసుల వెంచర్లకు వ్యవస్థాపకుడు కూడా. ఏఐ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాల్లో విశేష అనుభవం కలిగిన సోమానీ, మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు సహ-యజమానిగానూ వ్యవహరిస్తున్నారు.

టీఎంఆర్ డబ్ల్యూ స్పోర్ట్స్, టీజీఎల్ గోల్ఫ్ లీగ్ వంటి వెంచర్లలో కల్ సోమానీ ప్రారంభ పెట్టుబడిదారుగా ఉన్నారు. కాగా, రాజస్థాన్ రాయల్స్‌లో ఆయన తొలిసారిగా 2021లోనే పెట్టుబడి పెట్టారు.

Story first published: Tuesday, March 24, 2026, 17:20 [IST]
Other articles published on Mar 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+