
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. మరికొద్దిసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ చేసిన ఓ ఫన్నీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా చురుకుగా ఉండే ఆర్‌ఆర్ అడ్మిన్ మరోసారి తనదైన ట్వీట్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ తొలి దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దాదాపు విజయం ఖాయమనుకుంటున్న దశలో ఆర్‌సీబీ హిట్టర్ దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్) సెన్సేషనల్ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్ ఆర్‌ఆర్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే దినేశ్ కార్తీక్‌ను ఆర్‌ఆర్ భయపడుతుంది. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ అడ్మిన్ అతన్ని తప్పుదోవ పట్టించేలా ట్విటర్ వేదికగా ఫన్నీ పోస్ట్ చేశాడు. దినేశ్ కార్తీక్ జట్టుకు అందుబాటులో ఉండవద్దని భావించి.. తప్పుడు రూట్ మ్యాప్‌ను షేర్ చేసింది.
'ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. నువ్వు ఈ మార్గంలో సులువుగా పుణే చేరుకోగలవు. అంటూ.. గోవా, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మీదగా పుణే చేరుకోవాలి'అని కార్తీక్‌కు సూచిస్తూ రూట్ మ్యాప్‌ను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. రాజస్ధాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, ఆర్‌సీబీ.. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఐదో ప్లేస్‌లో కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్.. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 210 పరుగులు చేశాడు. చివర్లో ధాటైన బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు.