For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్‌ స్మిత్‌పై వేటు తప్పదా.. టీమిండియా యువ ఆటగాడికి కెప్టెన్‌గా అవకాశం!!

Rajasthan Royals likely to release Steve Smith for IPL 2021

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ప్రతిబంధకాలను దాటుకుని యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 సీజన్‌ విజయవంతం అయింది. ఇక 2021లో 14వ సీజన్‌ రెడీ అవుతోంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం ఫిబ్రవరిలో మినీ వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 20లోగా తమకు వద్దనుకున్న ఆటగాళ్లను వేలంలోకి విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీలకు సూచించింది. దీంతో అన్ని జట్లు తమ ఆటగాళ్ల గత ప్రదర్శనపై కసరత్తుల్ని ప్రారంభించాయి.

స్మిత్‌పై వేటు తప్పదా:

స్మిత్‌పై వేటు తప్పదా:

తాజా సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఏడాది వేలానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్‌) అతన్ని వదులుకోవాలని చూస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. గత సీజన్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా పేలవ ప్రదర్శన చేసినందుకు స్మిత్‌పై వేటు వేయాలని ఆర్‌ఆర్‌ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్మిత్‌ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

 4 మ్యాచ్‌లలో 311 రన్స్:

4 మ్యాచ్‌లలో 311 రన్స్:

ఐపీఎల్ 2020లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా.. ఆ తర్వాత పేలవ ఆటతో మూల్యం చెల్లించుకుంది. ఆర్‌ఆర్‌ వరుసగా మూడో ఏడాది ప్లేఆఫ్‌ బెర్తు కూడా దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్‌ పేలవ ప్రదర్శన, కెప్టెన్‌గానూ జట్టును నడిపించిన తీరుపై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే వేటు వేయాలని చూస్తోంది. లీగ్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌.. 131 స్ట్రైక్‌ రేట్‌తో 311 రన్స్‌ చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. 2018 మెగా వేలానికి ముందు రాజస్థాన్‌ అట్టిపెట్టుకున్న ఏకైన ఆటగాడు స్మిత్‌. అతని కోసం రూ.12.5కోట్లకు వెచ్చించింది.

రహానే నుంచి బాధ్యతలు:

రహానే నుంచి బాధ్యతలు:

ఏడాది నిషేధం కారణంగా ఐపీఎల్ 2018 సీజన్‌కి దూరమైన స్టీవ్‌ స్మిత్.. ఐపీఎల్ 2019 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల్ని అజింక్య రహానే చేతి నుంచి అందుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా కెప్టెన్‌గా కొనసాగిన స్మిత్.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. భారత్‌తో సిడ్నీ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ని స్మిత్ చెరిపేయడం స్టంప్ కెమెరాకు చిక్కింది. దాంతో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా స్మిత్‌ తీరుపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. రాజస్థాన్ అతన్ని వదులుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని వార్తలు వస్తున్నాయి.

కరోనా లేదు.. సైనాకు లైన్‌ క్లియర్‌!! శ్రీకాంత్ ముక్కులో నుంచి రక్తం!

Story first published: Tuesday, January 12, 2021, 21:15 [IST]
Other articles published on Jan 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+