
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ ఇంగ్లాండ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. సర్రేలోని రీడ్స్ స్కూల్‌లో ఉన్న స్టార్ క్రికెట్ అకాడమీతో రాజస్థాన్ ఒప్పందు కుదుర్చుకుంది. స్టార్ క్రికెట్ అకాడమీలో అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్ది అనంతరం దానిని రాజస్థాన్ రాయల్స్ అకాడమీగా పేరు మార్చారు.
ఈ ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్‌ను టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్ లాహిరీ నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు అంతర్జాతీయ కోచ్‌లు, మెంటార్ల పర్యవేక్షణలో అకాడమీలో ఉన్న యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జోస్ బట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా జోస్ బట్లర్ మాట్లాడుతూ "లండన్‌లో రాజస్థాన్ రా#mce_temp_url#యల్స్ క్రికెట్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతో టాలెంట్ ఉందని, ఐపీఎల్ నుంచి ఏదైతే నేర్చుకుంటామో దానిని ఇక్కడ వారికి ట్రాన్ఫర్ చేయొచ్చు" అని అన్నారు.
మరోవైపు ఈ అకాడమీ ఓనర్ మనోజ్ బదాలే మాట్లాడుతూ రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ఇక్కడ అకాడమీని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా, ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‍లో సీఎక్కే, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.