For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్ రాకపై క్లారిటీ లేదబ్బా: రాజస్థాన్ రాయల్స్ కోచ్

 Rajasthan Royals head coach unsure about the availability of Ben Stokes in IPL 2020

దుబాయ్: కరోనా దెబ్బతో భారత్‌ను వదిలి యూఏఈలో అడుగుపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చగా పరుచుకున్న మైదానాల్లో అభిమానులకు కావాల్సిన మజాను అందించేందుకు జట్లన్నీ సిద్దమయ్యాయి. మరో 4 రోజుల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగే రసవత్తర పోరుతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. టైటిలే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి.

నో క్లారిటీ..

నో క్లారిటీ..

అయితే లీగ్ ప్రారంభ గడువు సమీపిస్తున్నా తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ రాకపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదని రాజస్థాన్ రాయల్స్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నాడు. అయితే ఈ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడటం కష్టమేనని ప్రచారం జరుగుతుంది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి స్టోక్స్ అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అతని తండ్రి అనారోగ్యానికి గురవడంతో అతను హుటాహుటిన న్యూజిలాండ్ వెళ్లాడు. స్టోక్స్ తండ్రి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

 వ్యక్తిగత కారణాలతో..

వ్యక్తిగత కారణాలతో..

ఈ కారణంతోనే పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కూడా స్టోక్స్ అందుబాటులో లేడు. ఇక ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా స్టోక్స్ ఎంపికకాలేదు. దీంతో అతను కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంకానున్నాడనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అతను ఐపీఎల్‌లో బరిలోకి దిగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే స్టోక్స్ గైర్హాజరీపై ఇటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కానీ.. అటు ఇంగ్లండ్ క్రికెటర్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాజస్థాన్ రిప్లేస్‌మెంట్‌కు కూడా ప్రయత్నించలేదు. తాజాగా స్టోక్స్ వ్యవహారంపై రాజస్థాన్ కోచ్ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు.

 ప్రస్తుతానికి ఏం చెప్పలేం..

ప్రస్తుతానికి ఏం చెప్పలేం..

‘ప్రస్తుతానికైతే ఐపీఎల్ 2020 సీజన్‌కు స్టోక్స్ అందుబాటులో ఉండే విషయంపై క్లారిటీ లేదు. అతను క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో మేం కూడా అతనికి కావాల్సిన సమయం ఇవ్వాలనుకున్నాం. అయితే స్టోక్స్ ఎప్పుడు వస్తాడనే విషయాన్ని మాత్రం చెప్పలేం. ఈ విషయంలో అతను ఏదైనా క్లారిటీ ఇస్తే మేం తుది నిర్ణయం తీసుకుంటాం'అని మెక్‌డొనాల్డ్ అన్నాడు.

 రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ..

రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ..

ఇక స్టోక్స్ దూరమైతే రాజస్థాన్‌కు కష్టాలు తప్పవు. అతని గైర్హాజరీతో మిడిలార్డర్ బలహీనంగా మారుతుంది. అటు బౌలింగ్‌లోనూ లోటు ఏర్పడుతుంది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌‌తో రాణించే త్రీడైమన్షన్ ఆటగాడైన స్టోక్స్ గైర్హాజరీ ఆ జట్టుకు తీవ్ర లోటు ఏర్పడుతుంది. అతన్ని భర్తీ చేసే ఆటగాడు కూడా ఎవరూ లేరు. కాకపోతే బ్యాటింగ్‌లో డేవిడ్ మిల్లర్, టామ్ కరణ్‌లతో భర్తీ చేయవచ్చు. ఇక రాజస్థాన్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. అరంగేట్ర సీజన్ మినహా మళ్లీ ఆ జట్టు టైటిల్ అందుకోలేదు. ఈ సారి ఎలాగైనా ఆ కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తోంది.

Story first published: Tuesday, September 15, 2020, 12:52 [IST]
Other articles published on Sep 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+