వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలి: యాక్టివిస్ట్
రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వెంటనే ఐపీఎల్ నుంచి తొలగించాలని ఓ యాక్టివిస్ట్ డిమాండ్ చేశాడు. లేకపోతే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. 15 ఏళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదని, ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుందని పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌ను పక్కనపెట్టి చదవుకోవాలని హితవు పలికాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే 12 ఏళ్ల వయసు నుంచే వైభవ్ సూర్యవంశీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు.
సిక్సర పిడుగు..
బిహార్ తరఫున 12 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఆ తర్వాత భారత అండర్ 19 జట్టుకు ఎంపికైన వైభవ్.. ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీలో కూడా బరిలోకి దిగాడు. అండర్ 19 ప్రపంచకప్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

14 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడంతో పాటు 35 బంతుల్లోనే సెంచరీబాది ఈ ఘనతను అందుకున్న పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఇటీవలే 15వ జన్మదినం జరుపుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 10 మ్యాచ్‌ల్లో 404 పరుగులు చేసి అత్యధిక పరుగుల బ్యాటర్ల జాబితాలో టాప్ 4లో కొనసాగుతున్నాడు.
చైల్డ్ లేబర్ యాక్ట్ క్రీడాకారులకు వర్తిస్తుందా..?
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. అతను ఆడినా.. విఫలమైనా దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. ఐకాన్ ప్లేయర్‌గా ఎదిగిన వైభవ్ సూర్యవంశీపై కన్నడ టీవీ ప్రోగ్రామ్‌లో యాక్టివిస్ట్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను ఐపీఎల్ నుంచి తొలగించి స్కూల్‌కు పంపాలని డిమాండ్ చేశాడు. లేదంటే లేబర్ చైల్డ్ యాక్ట్ కింద వేస్తానని హెచ్చరించాడు.
భారత బాల కార్మిక నిరోధక సవర్ణ చట్టం 2016 ప్రకారం.. 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్‌గా పరిగణించరు. వారి ప్రతిభను ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు ఇతర క్రీడల్లోనూ 10 ఏళ్ల వయసులోనే ఆడటం మొదలు పెడుతారు.
వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌తో సత్కరించింది. కాబట్టి సెన్సేషన్ కోసం సదరు యాక్టివిస్ట్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications