Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓ ఇంటివాడు కాబోతున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్.. ప్రియురాలితో నిశ్చితార్థం!

 Rajasthan Royals all-rounder Rahul Tewatia gets engaged to his longtime girlfriend Ridhi

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు రిధితో బుధవారం నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఖారారు చేసుకోలేదు. ఇక తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను తెవాటియానే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎంగేజ్‌మెంట్ డేట్ 3-2-2021 రింగ్, లవ్ ఏమోజీలను క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఈ హర్యానా క్రికెటర్ నిశ్చితార్థానికి కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ నితీష్ రాణా సతీసమేతంగా హాజరయ్యాడు. అతనితో పాటు జయంత్ యాదవ్ కూడా నిశ్చితార్థ వేడుకులో పాల్గొన్నాడు. ప్రస్తుతం తేవాటియా నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇక భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక్కక్కరుగా వివాహబంధంతో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్, జయ్‌దేవ్ ఉనద్కత్ పెళ్లిచేసుకోగా.. ఇప్పుడు రాహుల్ తెవాటియా కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెవాటియా ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాది స్టార్‌గా మారిపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డ తెవాటియా.. చివర్లతో విధ్వంసకర బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. (31 బంతుల్లో 53) అజేయ హాఫ్ సెంచరీతో అద్భుత విజయాన్నందించాడు.

ఈ ఒక్క పెర్ఫామెన్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన రాహుల్ తెవాటియా అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరూ(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి సంతక చేసిన జెర్సీని అందుకున్నాడు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్ రియాన్ పరాగ్‌తో కలిసి ఇదే తరహా బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్ కోసం తెవాటియాను రాజస్థాన్ రిటైన్ చేసుకుంది.

Story first published: Thursday, February 4, 2021, 14:47 [IST]
Other articles published on Feb 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+