Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Raj Limbani: ఎవడ్రా వీడు మరి ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు!

రాజ్ లింబానీ ప్రస్తుతం భారత క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో ఈ కుర్రాడు సంచలన ప్రదర్శన‌తో భారత్‌ను ఫైనల్ చేర్చాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో రాజ్ లింబానీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక సమయంలో 4 బంతుల్లో 13 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

ఉత్కంఠగా మారిన ఈ మ్యాచ్‌లో ఓ భారీ సిక్సర్‌తో విజయానికి బాటలు వేసిన రాజ్‌లింబానీ.. విన్నింగ్ షాట్‌గా బౌండరీ బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లే తీసినప్పటికీ.. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి కట్టడి చేశాడు. దాంతో రాజ్ లింబానీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Raj Limbani: Farmers son and swing bowler from Rann of Kutch shining in U19 World Cup

రైతు బిడ్డగా: రాజ్ లింబానీ పాకిస్థాన్‌కు 27 కిలోమీటర్ల దూరంలోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని దయాపర్ జిల్లాలో జన్మించాడు. సాధారణ రైతు కుటుంబం నుంచి అండర్ 19 క్రికెటర్‌గా ఎదిగాడు. రాజ్ లింబానీ అతనికి తండ్రి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇతర సోదరుల్లా అహ్మదాబాద్, సూరత్ వెళ్లి చదుకోవడం లేదా వ్యవసాయంలో సాయంగా ఉండటం.

కానీ ఈ రెండు ఆప్షన్స్‌ను లింబానీ ఎంచుకోలేదు. భారత క్రికెటర్‌గా ఎదగాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు బరోడాకు చేరుకున్నాడు. తన ఊరికి 557 కిలోమీటర్ల దూరంలో బరోడా ఉన్నా.. ఇష్టమైన ఆట కోసం ఇంటిని వదిలేసాడు. క్రికెటర్ అవుతానన్న రాజ్‌లింబానీకి అతని తండ్రి అండగా నిలిచాడు. క్రికెట్‌లో విఫలమైతే మాత్రం ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేసుకోవాలని చెప్పాడు.

నేపాల్‌‌పై ఏడు వికెట్లతో: నచ్చిన ఆట కోసం బరోడాకు చేరుకున్న రాజ్ లింబానీ కోచ్‌ల పర్యవేక్షణలో ఆటను నేర్చుకున్నాడు. కొన్నిసార్లు తప్పిదాలు చేసి.. విఫలమైనా కోచ్‌ల సహకారంతో భారత అండర్ 19 జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ మెగా టోర్నీకి ముందే రాజ్ లింబానీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్ 19 ఆసియాకప్‌లో నేపాల్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో లింబానీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు.

కుడిచేతి స్వింగ్ బౌలర్ అయిన లింబానీ కొత్త, పాత అనే తేడాలేకుండా స్వింగ్ రాబట్టడం దిట్ట. ఆసియా కప్‌లో 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ శైలిని తలపించే రాజ్ లింబానీ.. బ్యాటింగ్‌లోనూ అతనిలానే భారీ షాట్లు ఆడగలడు.

Raj Limbani: Farmers son and swing bowler from Rann of Kutch shining in U19 World Cup

ఏడారి ఇసుకలో ప్రాక్టీస్: తమది ఏడారి ప్రాంతం కావడంతో కఠిన వాతావరణంలో రాజ్ లింబానీ ప్రాక్టీస్ చేసేవాడని అతని తండ్రి వసంత్ తెలిపాడు. ఇసుకలో తీవ్ర ఎండలో గంటల కొద్ది క్రికెట్ ఆడేవాడని గుర్తు చేసుకున్నాడు. టెన్నిస్ బాల్‌తో ఆడటం మొదలుపెట్టిన లింబానీ.. ఆ తర్వాత కార్క్ బాల్, ఇప్పుడు గ్రేస్ బాల్‌తో ఆడుతున్నాడని చెప్పాడు.

రాజ్‌లింబానీ టాలెంట్ కాకుండా అతని బ్యాక్ గ్రౌండ్ చూసి చేరదీసానని అతని కోచ్ దిగ్విజయ్ సింగ్ రాత్వా తెలిపాడు. 'తొలిసారి రాజ్ లింబానీని అండర్ 16 క్యాంప్‌లో చూశాను. క్రికెట్ నేర్చుకునే కుర్రాళ్లను ఎవరిని ఏం అవుతావని ప్రశ్నిస్తే అందరూ భారత జట్టుకు ఆడుతానని సమాదానం చెప్పేవారు. కానీ రాజ్‌లిబానీ మాత్రం.. తన డైరీని చూపించాడు.

టార్గెట్‌పై క్లారిటీ: అందులో అండర్ 16‌కు ఎంపికవ్వాలని.. ఆ తర్వాత అండర్ 19కు ఆడాలని.. అనంతరం ఎన్‌సీఏ క్యాంప్‌కు హాజరై అండర్ 19 ప్రపంచకప్ ఆడాలని రాసుకున్నాడు. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి బరోడా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి.. ఆ తర్వాత భారత్ ఏ తరఫున బరిలోకి దిగి సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆటపై అతనికి ఉన్న క్లారిటీ ఆకట్టుకుంది.' అని దిగ్విజయ్ సింగ్ రత్వా చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, February 7, 2024, 14:16 [IST]
Other articles published on Feb 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+