Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X సౌతాఫ్రికా ఫైనల్‌కు భారీ అడ్డంకి! (వీడియో)

మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే భారత్ X సౌతాఫ్రికా మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న నవీ ముంబైలో ప్రస్తుతం భారీ వర్షం పడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం సమీపంలో భారీ వర్షం కురుస్తుందని కార్తీక్ కన్నన్ అనే ఓ నెటిజన్ ఎక్స్(ట్విటర్) వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుందని, మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ వీడియో వర్షం భారీగా పడుతుంది. ఫైనల్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది.

మ్యాచ్ రద్దయితే..?

మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. కానీ అక్కడ భారీ వర్షం పడుతుంది. ఒకవేళ వర్షం ఆగినా మైదానం చిత్తడిగా మారి ఆటకు అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. ఆగిపోయిన ఓవర్ల నుంచే రిజర్వ్ డే అయిన సోమవారం ఆటను కొనసాగిస్తారు. ఒక సారి టాస్ వేస్తే.. ఆ మ్యాచ్‌ను లైవ్‌గా పరిగణిస్తారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే సోమవారం కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్ రద్దయ్యే భారీ వర్ష సూచన అయితే లేదు. ఇది అభిమానులకు ఉపశమనం ఇస్తోంది.

Rain Threat Looms as Showers Hit DY Patil Stadium Before India vs South Africa Women s World Cup 2025 Final
Photo Credit: X (twitter)

ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల్లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడేలా చూస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. కానీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ ఫైనల్‌కు అలాంటి పరిస్థితి అయితే లేదు. 20 ఓవర్ల చొప్పున కనీసం 20 ఓవర్ల ఆట అయినా సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి.

చరిత్రకు అడుగు దూరంలో..

ఎన్నో అవమానాలు.. మరెన్నో అసౌకర్యాలను తట్టుకొని నిలబడిన భారత మహిళల జట్టు విశ్వ కిరీటాన్ని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. తన అర్ధశతాబ్దపు నిరీక్షణకు తెరదించేందుకు ఊవ్విళ్లూరుతోంది. పురుషుల క్రికెట్ రాతను మార్చిన 1983 తరహాలో వరల్డ్ కప్ విజయం మహిళల క్రికెట్‌కు మేలిమలుపుగా మారే ఘట్టం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. 11 ప్రపంచకప్‌లు ఆడిన భారత్ 2005, 2017లో తుది పోరుకు చేరినా.. తృటిలో టైటిల్ చేజారింది. ఈ సారైనా ఆ కల నెరవేరాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది.

Story first published: Sunday, November 2, 2025, 14:04 [IST]
Other articles published on Nov 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+