For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి రాహుల్ త్రిపాఠి.. భారీ ధరకు కొన్న కావ్య పాప!

Rahul Tripathi Sold For SRH For 8.5 Cr in IPL 2022 Mega Auction
IPL Auction 2022: SRH Strategy అర్థంకాక తల పట్టుకున్న ఫ్యాన్స్ |Rahul Tripathi | Oneindia Telugu

బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లందరిని వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. దేశీయ స్టార్లపై దృష్టిపెట్టింది. కేకేఆర్ మాజీ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని రూ. 8.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. త్రిపాఠి కోసం ఇతర ఫ్రాంచైజీల నుంచి పోటీ ఎదురైనా.. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తగ్గేదేలే అంటూ పోటీపడింది. త్రిపాఠి కోసం కోల్‌కతా, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడీ బిడ్ చేశాయి. కానీ చివరకు హైదరాబాదే అతన్ని దక్కించుకుంది. రాహుల్ త్రిపాఠీ దక్కడంతో కావ్య పాపా ముఖంలో చిరునవ్వు కనిపించింది. గత సీజన్‌లో కేకేఆర్ తరఫున రూ.60 లక్షలు మాత్రమే అందుకున్న రాహుల్ త్రిపాఠి.. ఈ సారి ఏకంగా 14 రెట్ల భారీ ధరను సొంతం చేసుకున్నాడు.\\

గత సీజన్‌లో రాహుల్ త్రిపాఠి కేకేఆర్ తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. 17 మ్యాచ్‌ల్లో 397 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఓవరాల్‌గా 104 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి.. 130.29 స్ట్రైక్‌రేట్‌తో 2215 రన్స్ చేసింది. ఇండియన్ ప్లేయర్స్‌ను టార్గెట్ చేసిన ఆరెంజ్ ఆర్మీ వారి కోసం ఎంత ధరనైనా చెల్లించేందుకు పోటీపడుతోంది. ఇషాన్ కిషన్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నించింది. ఇక ప్రియామ్ గార్గ్‌ను అతని కనీస ధర రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. అంతకుముందు వాషింగ్టన్ సుంధర్‌తో వేలంలో ఖాతా తెరిచిన హైదరాబాద్.. నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మాజీ ప్లేయర్లు నటరాజన్, భువనేశ్వర్ కుమార్‌, ప్రియామ్ గార్గ్‌లను మళ్లీ కొనుగోలు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్

కేన్ విలిమ్సన్(రూ.14 కోట్లు)

అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు)

ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు)

వాషింగ్టన్ సుంధర్(రూ.8.75 కోట్లు)

నికోలస్ పూరన్(రూ. 10.75 కోట్లు)

Story first published: Saturday, February 12, 2022, 20:16 [IST]
Other articles published on Feb 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+