చెలరేగిన రాహుల్ తెవాటియా.. 6 సిక్సర్లతో వీరవిహారం!

న్యూఢిల్లీ: టీమిండియాకు ఎంపికయ్యాననే ఆనందమో ఏమో కానీ రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధిపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హరియానా తరఫున ఆడుతున్న తెవాటియా.. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.

నమ్మలేదు..
ఇంగ్లండ్‌తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న తెవాటియాతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ కూడా టీమిండియాకు ఎంపికయ్యారు. కాగా, ఎంపికపై తెవాటియా స్పందించాడు. భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయం తొలుత చాహల్ చెప్పినప్పుడు నమ్మలేదన్నాడు. ఆ తర్వాత మోహిత్ శర్మ కూడా చెప్పడంతో సెలక్టైన విషయాన్ని తెలుసుకున్నానని తెలిపాడు. మరోవైపు సూర్యకుమార్ తన ఎంపిక వార్త తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు.

తప్పని ఓటమి..
రాహుల్ తెవాటియా రాణించినా హరియానాకు ఓటమి తప్పలేదు అతనితో పాటు హిమన్షు రాణా సెంచరీతో రాణించడంతో హరియానా 50 ఓవర్లలో 9 వికెట్లకు 299 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చండీగఢ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లకు 300 రన్స్ చేసి మూడు వికెట్లతో గెలుపొందింది. కెప్టెన్ మనన్ వోహ్రా(117) సెంచరీకి తోడు అంకిత్ కౌశిక్(73 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు విజయం సులువైంది.

ఐదు సిక్సర్లతో..
ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా 255 పరుగులు చేసి 10 వికెట్లు పడగొట్టగా.. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కాట్రెల్‌కి ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లని తెవాటియా బాదిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో రాజస్థాన్ టీమ్‌లో ఫినిషర్ రోల్‌ని తెవాటియా సమర్థవంతంగా పోషించాడు.

భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), యుజ్వేందర్ చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications