For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KSCA T20 Auction: ద్రవిడ్ కొడుకు అన్‌సోల్డ్.. ఆర్‌సీబీ ప్లేయర్‌కు రికార్డ్ ధర!

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమత్ ద్రవిడ్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన ఈ వేలంలో ఆల్‌రౌండర్ అయిన సమిత్ ద్రవిడ్‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. గతేడాది ఈ టోర్నీలో భాగమైన సమత్ ద్రవిడ్‌కు ఈ సారి మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది. సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం కర్ణాటక తరఫున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన అండర్‌ 19 సిరీస్‌కు సమిత్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. కానీ సిరీస్ ప్రారంభానికి ముందు గాయపడటంతో ఈ సిరీస్ ఆడలేకపోయాడు.

19 ఏళ్ల వయసు ధాటనుండటంతో సమిత్ ద్రవిడ్‌కు 2026లో జరిగే అండర్ 19 ప్రపంచకప్‌ ఆడలేని పరిస్థితి నెలకొంది. గత ఎడిషన్‌లో మైసూర్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సమిత్ దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ మొత్తం 82 పరుగులే చేశాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా.. వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. 19 ఏళ్ల సమిత్.. కర్ణాటక తరఫున ఇంకా దేశవాళీ క్రికెట్ ఆడలేదు.

Rahul Dravid s Son Samit Goes Unsold in Maharaja Trophy KSCA T20 Auction

ఆర్‌సీబీ ప్లేయర్‌కు భారీ ధర..

మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్‌ అత్యధిక ధర పలికాడు. అతన్ని రూ.13.20 లక్షల భారీ ధరకు హుబ్లీ టైగర్స్ కొనుగోలు చేసింది. వెటరన్ బ్యాటర్ మనీష్ పాండే రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ కొనుగోలు చేయగా.. అభినవ్ మనోహర్‌ను రూ. 12.20 లక్షలకు హుబ్లీ టైగర్స్‌ తీసుకుంది. శ్రేయస్ గోపాల్‌ను రూ.8.60 లక్షలకు మంగళూరు డ్రాగన్స్ కొనుగోలు చేసింది.


ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సెహ్వాగ్ కొడుకులు..

ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) రెండో సీజన్‌ వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయులు కూడా పాల్గొన్నారు. పెద్దకొడుకు ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ. 8 లక్షలకు తీసుకోగా.. చిన్నోడు వేదాంత్ అన్‌సోల్డ్‌గా నిలిచాడు. కోహ్లీ అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లీ సూపర్ స్టార్జ్ జట్టు రూ. 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసింది. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్‌ ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడుతున్నాడు.

Story first published: Wednesday, July 16, 2025, 10:11 [IST]
Other articles published on Jul 16, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+