Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Anvay Dravid: సత్తా చాటిన రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు!

టీమిండియా మాజీ హెడ్ కోచ్, దివాల్ రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు అన్వే ద్రవిడ్ (Anvay Dravid) సత్తా చాటాడు. శ్రీలంక గడ్డపై ఆ దేశ అండర్ 19 టీమ్‌తో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్(67 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 87) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

Samit Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. సత్తా చాటిన ద్రవిడ్ కొడుకు!

Samit Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. సత్తా చాటిన ద్రవిడ్ కొడుకు!

81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత అండర్ 19 టీమ్‌ను తన తండ్రి తరహాలోనే ఆకట్టుకున్నాడు. అర్జున్ రాజ్‌పుత్(81 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 76)తో కలిసి ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు. రాజ్‌పుత్‌తో పాటు తెలుగు తేజం యశ్వీర్ గౌడ్(7) విఫలమైనా.. జట్టు స్కోర్‌ను 250 ధాటించాడు. సెంచరీకి చేరువైన అన్వయ్ ద్రవిడ్.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అన్వయ్ ద్రవిడ్ వికెట్ అనంతరం భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది.

Rahul Dravid s son Anvay Dravid s Brilliant 87 Powers India U-19 to 285 Against Sri Lanka U-19

ఏడో వికెట్‌గా అన్వయ్ వెనుదిరగ్గా.. 22 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను భారత్ అండర్ 19 టీమ్ కోల్పోయింది. దాంతో భారత్ అండర్ 19 టీమ్ 47.2 ఓవర్లలో 285 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక్ అండర్ 19 బౌలర్లలో గిమ్హానా మెండీస్(5/41) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. గమేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సేత్మికాకు ఓ వికెట్ దక్కింది.

గంభీర్‌ను తప్పుబట్టిన రాహుల్ ద్రవిడ్!

గంభీర్‌ను తప్పుబట్టిన రాహుల్ ద్రవిడ్!

286 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ దుల్నిత్ సెగెరా(14) విఫలమైనా.. మరో ఓపెనర్ మహవితణ(123 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కాడు. సెనుజు వేకునగోడ(64 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. కెప్టెన్ విమత్ దినేసరతో కలిసి మహవితణ జట్టు విజయం దిశగా నడిపిస్తున్నారు. భారత అండర్ 19 బౌలర్లలో ఇసాన్ సూద్, షావిన్ వినోద్ చెరో వికెట్ తీసారు.

Story first published: Monday, July 6, 2026, 17:03 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+