
ఇంగ్లండ్ పర్యటనకు కోహ్లీసేన
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసాక.. భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది.

కోచ్‌గా ద్రవిడ్
శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో భారత జట్టు (ఇండియా-బి టీమ్)ను బీసీసీఐ ఎంపికచేయనుంది. ప్రధాన జట్టులో చోటు దక్కని సీనియర్లు, ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో ఓ జట్టును బీసీసీఐ లంకకు పంపనుంది. అయితే ప్రధాన జట్టుతో పాటే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లబోతున్నారు. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.
అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి.. చిన్నారికి పాలు ఇచ్చిన క్రీడాకారిణి! ఆటాడుకుంటున్న నెటిజన్లు!!

ద్రవిడ్ అయితేనే మేలు
'శ్రీలంక సిరీస్ సమయంలో టీమిండియా ప్రధాన కోచింగ్ సిబ్బంది ఇంగ్లండ్ పర్యటనలో ఉంటుంది. అందుకే భారత యువ జట్టుకు రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశం చేయబడటం ఉత్తమం. ఎందుకంటే.. ఆయన ఇప్పటికే దాదాపు అన్ని భారత 'ఎ' జట్లతో కలిసి పనిచేశారు. యువకులు అతనితో అన్ని విషయాలు పంచుకుంటారు. ఇది జట్టుకు మరింత ప్రయోజనం చేకూరనుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్ కూడా లంకకి వెళ్లనున్నారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. లంక పర్యటనకు కోచ్‌గా ద్రవిడ్ వెళ్లడం ఖాయం అయినా.. కెప్టెన్ ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. కెప్టెన్ రేసులో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఉన్నాడు.

జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి
సమాచారం ప్రకారం భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్ ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి.
2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు లంక వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
