For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి.. చిన్నారికి పాలు ఇచ్చిన క్రీడాకారిణి! ఆటాడుకుంటున్న నెటిజన్లు!!

Australian snowboarder Torah Bright breastfeeding photo goes viral

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఒలింపిక్ స్నోబోర్డ్ ఛాంపియన్ టోరా బ్రైట్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయింది. అదే సమయంలో వివాదాస్పదంగానూ మారింది. విషయంలోకి వెళితే.. ఈ నెల 9న 'మదర్స్ డే' సందర్భంగా 34 ఏళ్ల టోరా బ్రైట్.. తన 10 నెలల కొడుకుకు బ్రెస్ట్‌ ఫీడింగ్ (పాలు పట్టడం) చేసింది. అయితే బ్రైట్ తన ఇంటి ఆవరణలో అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి.. తన చిన్నారికి పాలు ఇచ్చింది. ఇందుకు సంబందించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన తల్లి ప్రేమను చాటుకుంది.

'తల్లి కావడం నాలో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తల్లిప్రేమ ఓ అద్భుతం, ఓ ఆధ్యాత్మికం, ప్రాధమికం, భయంకరమైనది, స్వచ్ఛమైనది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో టోరా బ్రైట్ పేర్కొంది. అర్ధనగ్నంగా శీర్షాషనం వేసి చిన్నారికి పాలు ఇస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపింది. బ్రైట్‌పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. 'ఇలాంటి ప్రైవేట్ ఫొటోలు పోస్ట్ చేయకూడదని తెలియదా', 'పబ్లిసిటీ కోసం అమ్మతనాన్ని అవమానిస్తావా; 'సిగ్గులేదా కొంచమైనా' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం తల్లిప్రేమ గొప్పదని సమర్ధించారు కూడా.

తనపై వచ్చిన కామెంట్లపై టోరా బ్రైట్ స్పందించింది. 'నా ఫొటోపై వచ్చిన కామెంట్లు నాకు బాధ కలిగించాయి. నేను మాతృత్వం కలిగించే ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని కనుగొంటాను. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. అందులో తప్పు.. ఒప్పు అంటూ ఏమీ ఉండదు. మాతృత్వం స్వచ్ఛమైనది. పవిత్రమైన మథర్స్ క్లబ్‌లో చేరినందుకు ఇప్పుడు నన్ను నేను ఓ వండర్ ఉమెన్‌గా భావిస్తున్నా' అని బ్రైట్‌ సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

గత ఏప్రిల్‌లో కూడా టోరా బ్రైట్‌ ఇలానే పాలిచ్చే ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ సమయంలో చిన్నారి స్కేట్బోర్డింగ్ చేశాడు. జూలై 5, 2020న కుమారుడు (అంగస్ థామ్సన్‌)కి బ్రైట్‌ జన్మనిచ్చింది. అంగస్ అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. 2010 వాంకోవర్‌, 2014 సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో స్నోబోర్డింగ్‌ విభాగంలో గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ గెలుచుకుంది.

Story first published: Thursday, May 20, 2021, 12:28 [IST]
Other articles published on May 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+