For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: అతని వల్లే రాజస్థాన్‌కు రాహుల్ ద్రవిడ్ గుడ్‌బై ?

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆకస్మాత్తుగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంజూ శాంసన్‌తో నెలకొన్న విభేదాల నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్.. రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్‌బై చెప్పాడనే వాదన వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగిసిందని రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఫ్రాంచైజీలో మరింత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తామని చెప్పినా.. ద్రవిడ్ స్వీకరించలేదని తెలిపింది. జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు చెప్పింది.

అయితే సంజూ శాంసన్ ట్రేడింగ్ వార్తల నేపథ్యంలోనే ద్రవిడ్ తప్పుకున్నాడా? అనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ కోరినట్లు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్లేందుకు అతను సుముఖంగా ఉన్నాడని, ఆ జట్టు కూడా ట్రేడింగ్ డీల్‌పై చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. అయితే సంజూకు బదులు మరో ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ కోరడంతో సీఎస్‌కే వెనుకడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి.

Rahul Dravid to Conclude Tenure as RR Coach Amid Structural Review Fuels Speculation About Rift

సంజూ శాంసన్‌‌తో విభేదాలు, రాజస్థాన్ అదనపు బాధ్యతలు ఇస్తామని చెప్పడంతోనే ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2011లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన ద్రవిడ్.. 2013 వరకు ఆటగాడిగా కొనసాగాడు. ఆ తర్వాత 2014 2015 సీజన్లలో కోచ్‌గా వ్యవహరించాడు. అనంతరం 2015 2024 వరకు బీసీసీఐలో పలు హోదాల్లో పనిచేశాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా, భారత్ ఏ కోచ్‌గా, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2024 టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. అనంతరం అతనికి ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ద్రవిడ్ మాత్రం తిరిగి రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే చేరాడు. కానీ అతని పదవి కాలం అనూహ్యంగా ఏడాదికే పరిమితమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను మరో జట్టుకు కోచ్‌గా వ్వవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి.

రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లే ఆడాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడగా.. రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచిన రాజస్థాన్.. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానానికి పడిపోయింది. జోస్ బట్లర్‌ను రిటైన్ చేసుకోకపోవడాన్ని సంజూ శాంసన్ తప్పుబట్టాడని, ఈ విషయంలోనే అతనికి ద్రవిడ్ విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.

Story first published: Saturday, August 30, 2025, 17:39 [IST]
Other articles published on Aug 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+