Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Samit Dravid: ద్రవిడ్ కొడుకు కళ్లు చెదిరే సిక్సర్..(వీడియో)

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ కళ్లు చెదిరే సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహరాజా ట్రోఫీలో మైసూర్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. బెంగళూరు బ్లాస్టర్స్‌తో శుక్రవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 18 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఎస్‌యూ కార్తీక్, సీఏ కార్తీక్ నిలకడగా ఆడారు. ఎస్‌యూ కార్తీక్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన సమిత్ ద్రవిడ్.. జ్ఞానేశ్వర్ నవీన్ వేసిన ఏడో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని నవీన్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ పిచ్ బాల్‌గా వేయగా.. సమిత్ లెగ్ సైడ్ అద్భుతంగా సిక్సర్ తరలించాడు. ఈ సిక్సర్‌కు అభిమానులతో పాటు ఆటగాళ్లు అవాక్కయ్యారు. కానీ ఆ మరుసటి బంతికే సమిత్ ఔటయ్యాడు. మొత్తం ఏడు బంతుల్లో ఏడు పరుగులే చేశాడు.

Rahul Dravid s son samit s six hitting video from Maharaja Trophy 2024 goes viral

ప్రస్తుతం సమిత్ ద్రవిడ్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తండ్రికి తగ్గ తనయుడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతి త్వరలోనే సమిత్ ద్రవిడ్ టీమిండియాకు ఆడుతారని జోస్యం చెబుతున్నారు.

అనంతరం బెంగళూరు బ్లాస్టర్స్.. ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. సమిత్ ద్రవిడ్.. ఈ టోర్నీ వేలంలో రూ. 50 వేల బేస్ ప్రైజ్‌కు అమ్ముడుపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 7 పరుగులే చేసి నిరాశపరిచాడు.

Story first published: Saturday, August 17, 2024, 11:37 [IST]
Other articles published on Aug 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+