అందుకే విరాట్ కోహ్లీ మీడియా ముందుకు రాలేదు.. తప్పించుకోవడానికి కాదు: రాహుల్ ద్రవిడ్

జోహన్నెస్‌బర్గ్: వన్డే కెప్టెన్సీ మార్పు భారత క్రికెట్‌లో అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనకు ముందు మీడియా సమావేశంలో కెప్టెన్సీ మార్పు గురించి సెలెక్టర్ల నుంచి సరైన సమాచారం లేదని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. అతని మాటలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ఇక అప్పటి నుంచి కోహ్లీ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సంప్రదాయం ప్రకారం మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశానికి హజరవ్వాల్సి ఉన్నా.. కోచ్‌లు మాత్రమే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాను తప్పించుకునేందుకే కోహ్లీ దూరంగా ఉంటున్నాడనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ రూమర్స్‌ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొట్టిపారేసాడు. తన 100వ టెస్ట్‌కు ముందు కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొంటాడని స్పష్టం చేశాడు.

100వ మ్యాచ్‌కు ముందు..
సోమవారం నుంచి సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగానే కోహ్లీ హాజరుకాకపోవడంపై మీడియాను నిలదీయగా.. ద్రవిడ్‌పై విధంగా చెప్పుకొచ్చాడు. 'కొన్నాళ్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు దూరంగా ఉండాలని కోహ్లీకి నేనే చెప్పా. ఎందుకంటే కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కెరీర్‌లో అతనికి 100వ మ్యాచ్. అప్పుడు అతను మీడియా ముందుకు వస్తాడు. ఆ సందర్భంగా కోహ్లీ మాట్లాడితే అదో పెద్ద ఈవెంట్ అవుతోంది.

గేమ్‌తో ఇన్వాల్వ్..
100వ టెస్ట్ గురించి మీడియా ప్రతినిథులు అడగవచ్చు. మీరు కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఆస్వాదించవచ్చు. ఇంతకు మించి విరాట్ కోహ్లీ ఇక్కడ లేకపోవడానికి మరే కారణం లేదు. అయినా కోహ్లీ మీడియాకు దూరంగా ఉండాలనుకునే వ్యక్తి కాదు. గేమ్‌తో ఎప్పుడూ ఇన్వాల్స్ అయ్యే ఉంటాడు. మ్యాచ్‌కు మ్యాచ్ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తాడు. టాస్ టైమ్‌లో మాట్లాడుతాడు. 100వ టెస్ట్‌కు ముందు నిర్వహించే మీడియా సమావేశంలో కచ్చితంగా పాల్గొంటాడు. ఇక గత 20 రోజులుగా భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితులను విరాట్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆటపైనే ఫోకస్ పెట్టి జట్టు విజయం కోసమే కృషి చేశాడు'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

ఫామ్ అందుకుంటాడు..
విరాట్ కోహ్లీ త్వరలోనే ఫామ్ అందుకుంటాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'విరాట్ కోహ్లీ లీడర్.. అతని చుట్టూ ఇంత జరుగుతున్నా మైదానం లోపల, వెలుపల అందరితో చక్కగా మెలుగుతున్నాడు. ఇంతకంటే గొప్పగా కోహ్లీ గురించి నేను చెప్పలేను .అతనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఇక కోహ్లీ ఫామ్ గురించి అంటారా? అతను త్వరలోనే పెద్ద స్కోరు నమోదు చేస్తాడు. అతని బ్యాటింగ్ ప్రాక్టీస్, గేమ్‌లో ఇన్‌వాల్వ్ అవుతున్న తీరుని నేను గమనిస్తూనే ఉన్నా'' అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

అచ్చొచ్చిన మైదానంలో..
ఇటీవల సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 35, 18 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి ఒకే తరహాలో వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. రెండో టెస్టులోనూ విరాట్ కోహ్లీకి అవే బంతుల్నిసౌతాఫ్రికా బౌలర్లు పదే పదే సంధించే అవకాశం ఉంది. కానీ.. మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న జొహనెస్‌బర్గ్‌లో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డ్ ఉంది. అక్కడ మూడు టెస్టులాడిన కోహ్లీ 310 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications