For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rahul Dravid: వరల్డ్ కప్ టీమ్ కాంబినేషన్‌పై నాకు, రోహిత్‌కు ఆ క్లారిటీ ఉంది!

Rahul Dravid says No set formula but were clear about T20 World Cup team combination

కోల్‌కతా: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్ కాంబినేషన్‌పై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనే విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు తనకు క్లారిటీ ఉందని ద్రవిడ్‌ వెల్లడించాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారిపట్టడంతో ఈ సారి టీమ్ కాంబినేషన్‌పై పక్కాగా ఉండాలని బీసీసీఐ, టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో బరిలోకి దిగే టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే రోహిత్‌తో కలిసి చర్చించినట్లు ద్రవిడ్ తెలిపాడు.

మాకు క్లారిటీ ఉంది..

మాకు క్లారిటీ ఉంది..

‘నాతో పాటు రోహిత్‌ శర్మ, సెలక్టర్లకు టీమ్ కాంబినేషన్ విషయంలో ఒక స్పష్టత ఉంది. ఈ విషయంలో మేమేమీ ఒక నిర్ధిష్టమైన పద్ధతిని అనుసరించడం లేదు. కానీ ప్రపంచకప్‌కు జట్టు బ్యాలన్స్‌డ్‌గా ఎలా.. ఎలాంటి కాంబినేషన్‌తో ఆడాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఆటగాళ్లపై వర్క్‌లోడ్ సమీక్షిస్తూ ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్న అందరికీ వీలైనన్ని ఎక్కువ అవకాశాలివ్వడానికి ప్రయత్నిస్తాం. కచ్చితంగా ఇంతమందినే ఆడించాలని అనుకోవట్లేదు.

ఒక్క మ్యాచ్‌తో..

ఒక్క మ్యాచ్‌తో..

అదే సమయంలో మరీ ఎక్కువ మందిని పరీక్షించాలని భావించట్లేదు. కానీ ప్రతి ఒక్కరికీ ప్రపంచకప్‌ ఆరంభమయ్యేలోపు 10-20 మధ్య మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలనుకుంటున్నాం. ఒక్క మ్యాచ్‌ లేదా ఒక్క సిరీస్‌తో ఏ ఆటగాడిపైనా ఒక అంచనాకు రాలేం. టీ20 అనేది కఠినమైన ఫార్మాట్‌. సాహసంతో కూడుకున్న ఆట ఆడాల్సి ఉంటుంది. ఎప్పుడూ షాట్లు ఆడుతూనే ఉండమని చెబుతాం. అలా ఆడుతున్నపుడు ఎవరిపైనా వెంటనే ఒక అంచనాకు రాకూడదు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో రుతురాజ్‌, అవేష్‌ ఖాన్‌ ఆడారు. ఈ మ్యాచ్‌లో వీరి ప్రదర్శనను బట్టి ఒక ముద్ర వేయలేం'' అని ద్రవిడ్‌ అన్నాడు.

 వెంకటేశ్ అయ్యర్ సూపర్..

వెంకటేశ్ అయ్యర్ సూపర్..

సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌పై రాహుల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘అతను ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఆడతాడు. మేం అతడికి మిడిలార్డర్లో ఆడే బాధ్యత అప్పగించాం. వెస్టిండీస్‌తో సిరీస్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కూ అతను మెరుగయ్యాడు. ఆరో బౌలర్‌ అంటే ప్రతిసారీ బౌలింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. అంతా బాగున్నపుడు కెప్టెన్‌ అతడికి బంతి ఇవ్వకపోవచ్చు. కఠినమైన పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయమనొచ్చు. చివరి టీ20లో దీపక్‌ చాహర్‌ గాయపడితే వెంకటేశ్‌కు అలాగే రోహిత్‌ బంతినిచ్చాడు. అతను కీలక వికెట్లతో సత్తా చాటాడు. అతనీ సిరీస్‌లో రాణించడం టీమిండియాకు శుభ పరిణామం'అని ద్రవిడ్ మెచ్చుకున్నాడు.

సౌతాఫ్రికాలో ఓటమి బాధించింది..

సౌతాఫ్రికాలో ఓటమి బాధించింది..

గతేడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. ఈ నెల 17న కోచ్‌గా 100 రోజులు పూర్తి చేసుకున్నాడు. ఈ జర్నీపై ద్రవిడ్ స్పందించాడు. ‘ఈ100 రోజుల్లో నేను చాలా నేర్చుకున్నా. ఫలితం గురించి ఎక్కువగా ఒత్తిడికి గురికాలేదు. టీమ్‌ను బెటర్‌గా తయారు చేస్తూ సరైన దిశలో ముందుకు సాగేలా చేయడంపైనే ఫోకస్ పెట్టా. సౌతాఫ్రికా టూర్ మాకు ఓ గుణపాఠం.

అక్కడ టెస్ట్, వన్డే సిరీస్ ఓడిపోవడం బాధ కలిగించింది. కానీ ఒక కోచ్‌గా రోజూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తా. తప్పులు చేయకూడదని అనుకోను. నేను తప్పులు చేస్తుంటా. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ప్రతీ రోజు మెరుగవ్వడానికి ప్రయత్నిస్తా'అని ద్రవిడ్ తెలిపాడు.

Story first published: Tuesday, February 22, 2022, 7:46 [IST]
Other articles published on Feb 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+