For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rahul Dravid: అండర్-19, భారత్-ఏ జట్లకు కోచింగ్ చేసినట్లు టీమిండియాకు చేస్తానంటే కుదరదు!

Rahul Dravid says Need to strike balance between winning games and building team
Team India భవిష్యత్‌ ప్రణాళికలపై Rahul Dravid || Oneindia Telugu

జైపూర్: అండర్-19, భారత్-ఏ జట్లకు కోచింగ్ చేసినట్లు టీమిండియాకు చేస్తానంటే కుదరదని నయా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జూనియర్ స్టాయిలో విజయం కంటే ఆటగాళ్ల భవిష్యత్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది, కానీ భారత జట్టుకు ప్రతీ మ్యాచ్ గెలవడంతో పాటు ఆటగాళ్లను సుదీర్ఘ కెరీర్ దిశగా నడిపించాల్సి ఉంటుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌తో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రాహుల్ ద్రవిడ్.. జైపూర్ వేదికగా నేడు జరిగే తొలి టీ20 నేపథ్యంలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడాడు. తమ పరస్పర బంధం గురించి.. అలాగే టీమిండియాకు సంబంధించిన భవిష్యత్‌ ప్రణాళికల గురించి ద్రవిడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అలా చేస్తానంటే నడవదు..

అలా చేస్తానంటే నడవదు..

'కోచింగ్‌ విషయంలో జూనియర్ స్థాయి, సీనియర్ టీమ్స్‌తో ఒకే రకంగా వ్యవహరించలేం. ఒక్కో జట్టుకు ఒక్కో విధమైన సవాళ్లు ఉంటాయి. అవసరాలు వేరుగా ఉంటాయి. అండర్‌-19 స్థాయిలో నేను చేసినవన్నీ ఇక్కడ చేయలేను. నా శైలే అలా ఉండదు. నిజానికి భారత జట్టు కోచ్‌గా నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనుకుంటున్నా. ఆటగాళ్ల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను బయటికి తెచ్చేలా మనల్ని మనం ముందు సిద్ధం చేసుకోవడం సహాయ సిబ్బంది ప్రధాన కర్తవ్యం.

జూనియర్, సీనియర్ తేడా అదే..

జూనియర్, సీనియర్ తేడా అదే..

జూనియర్‌ స్థాయిలో విజయం కంటే ఆటగాళ్లను భవిష్యత్‌ దిశగా సిద్ధం చేయడం కీలక అంశం. కానీ భారత జట్టుకు వస్తే ప్రతి మ్యాచ్‌ గెలవడం ప్రధాన కర్తవ్యం. దాంతో పాటే ఆటగాళ్లను సుదీర్ఘ కెరీర్‌ దిశగా నడిపించాలి. వచ్చే రెండేళ్లలో పెద్ద పెద్ద టోర్నీలు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో అందుకు ఆటగాళ్లను సిద్ధం చేయడం ముఖ్యం. ఏదో ఒక ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఉండదు. రాబోయే రెండేళ్లలో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌, టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌‌లు ఉన్నాయి. అన్నింటికీ సిద్దంగా ఉండాలి.'అని చెప్పుకొచ్చాడు.

మనకు సెట్ కాదు..

మనకు సెట్ కాదు..

వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను సిద్ధం చేసే ఆలోచనేమీ లేదని, అది మనకు సెట్ అవ్వదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. కొందరు ఒక ఫార్మాట్లోనే ఆడతారని, మరికొందరు అన్ని ఫార్మాట్లలోనూ ఆడతారని చెప్పాడు. ఆటగాళ్ల భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని సరైన స్థితిలో ఉంచడం కీలకమని, వాళ్లు తాజాగా ఉండేలా చూసుకోవాలన్నాడు.

అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, వాటిని పరిష్కరించే మార్గాలను కనుగొనాలని తెలిపాడు. ప్రస్తుతం క్రికెటర్లు చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నారని, కాబట్టి ఎవరికెప్పుడు విశ్రాంతి అవసరమో చూస్తుండాలన్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు రాకుండా, ప్రధాన టోర్నీలకు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

2007లో రోహిత్‌తో..

2007లో రోహిత్‌తో..

2007లో రోహిత్‌ ఐర్లాండ్‌ సిరీస్‌ కోసం తొలిసారి భారత జట్టులోకి వచ్చాడని, అయితే అంతకుముందే చాలెంజర్‌ టోర్నీ ఆడుతుండగా రోహిత్‌ను తొలిసారి చూశానని ద్రవిడ్ చెప్పాడు. ఈ 14 ఏళ్లలో అతను ఒక వ్యక్తి నుంచి నాయకుడి స్థాయికి ఎదిగాడని ప్రశంసించాడు. భారత ఆటగాడిగానే కాక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతను ఎంతో సాధించాడని, ముంబై, భారత క్రికెట్‌ ఘన వారసత్వాన్ని కొనసాగించడం అంత తేలిక కాదన్నాడు.

Story first published: Wednesday, November 17, 2021, 11:46 [IST]
Other articles published on Nov 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+