For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వామ్మో ఆ వీడియో నా పిల్లలకు అస్సలు చూపించను: రాహుల్ ద్రవిడ్

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం గట్టిగా అరుస్తూ సెలెబ్రేట్ చేసుకున్న వీడియోను తన పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో చూపించనని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ వీడియోను చూస్తే తమ పిల్లలు తనకు పిచ్చి పట్టిందని అనుకుంటారని తెలిపాడు. అంతేకాకుండా విజయాన్ని, ఓటమిని సమానంగా స్వీకరించాలని వారికి తరుచూ చెబుతుంటానని చెప్పిన ద్రవిడ్.. ఆ వీడియోను చూస్తే.. చెప్పేదొకటి చేసేదొకటని ఎదురు ప్రశ్నిస్తారని చెప్పుకొచ్చాడు.

టీమిండియా హెడ్ కోచ్‌గా తన హయాంలో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2023, టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిక్వెస్ట్‌తో హెడ్ కోచ్‌గా తన పదవికాలాన్ని పొడిగించుకున్న రాహుల్ ద్రవిడ్.. టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా చిరకాల కోరికను నేరవేర్చాడు.

Rahul Dravid Says My Kids Will Think I Have Gone Mad on Wild T20 World Cup 2024 Celebration

ఫైనల్లో సౌతాఫ్రికాపై గెలిచి ట్రోఫీ అందుకున్న అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా రాహుల్ ద్రవిడ్‌ను పిలిచి టైటిల్ అందించాడు. ఈ సమయంలో రాహుల్ ద్రవిడ్ గట్టిగా అరుస్తూ.. ట్రోఫీని పైకెత్తి సంబరాలు చేసుకున్నారు. తాజాగా CEAT అవార్డ్స్ కార్యక్రమంలో ఈ సెలెబ్రేషన్స్‌పై మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ వీడియోను తన పిల్లలకు చూపించనని తెలిపాడు.

'మేమంతా కలిసి సమష్టిగా సాధించిన విజయం అది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కష్టం తర్వాత అనుకున్న లక్ష్యం చేరినప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. అవి అద్భుతమైన క్షణాలు. వాటిని సెలెబ్రేట్ చేసుకోవడం గొప్పే. అయితే ఈ వీడియోను నా పిల్లలకు అస్సలు చూపించను. ఈ వీడియోను చూస్తే వారు నాకు పిచ్చి పట్టిందని అనుకుంటారు.

నేను ఎప్పుడూ ఓటమి, గెలుపును సమానంగా స్వీకరించాలని, సమతూకం పాటించాలని చెబుతుంటాను. ఆ దేవుడి దయ వల్ల హెడ్ కోచ్‌గా అదే నాకు చివరి మ్యాచ్ అయ్యింది. లేకుంటే ఇలాంటి సెలెబ్రేషన్స్‌ను చూసి నా పిల్లలు నన్ను 'చెప్పేది ఒకటి చేసేది ఒకటి'అని ప్రశ్నించేవారు.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

'అవార్డ్స్ అనేవి క్రికెట్ మైదానంలో మనం సాధించిన ఘనతలకు గుర్తింపుగా దక్కుతాయి. కానీ వాస్తవం ఏంటంటే ప్రతీ ఆటగాడికి సక్సెస్ కంటే వైఫల్యాలే ఎక్కువగా ఉంటాయి. సుదీర్ఘ కెరీర్‌లో ఈ వైఫల్యాలు, పరాభావాలు ఎదురవ్వడం సహజం. అయితే ఇవే ఆటగాడిని, కోచ్‌ను గొప్పగా మారుస్తాయి. ఈ క్షణాలు చాలా సరదాగా కూడా ఉంటాయి. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ట్రోఫీలు, పెద్ద ఈవెంట్స్, టెస్ట్, వన్డేలు, ఛాంపియన్ షిప్స్ గెలవడం ఒక అద్భుతమైన అనుభూతి.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, September 4, 2024, 11:51 [IST]
Other articles published on Sep 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+