Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంత చెత్తగా ఆడితే ఎలా గెలుస్తాం: రాహుల్ ద్రవిడ్

లండన్: ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తమ ఓటమికి ఎలాంటి సాకులు లేవని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈ మ్యాచ్ జరిగిన ఐదు రోజులు టీమిండియా బెస్ట్ క్రికెట్ ఆడలేకపోయిందన్నాడు. జట్టు చెత్త ప్రదర్శనే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. ఆదివారం ముగిసిన డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో గెలుపొంది విశ్వవిజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రాహుల్ ద్రవిడ్.. ఈ ఓటమికి ఎవర్నీ నిందించాల్సిన పనిలేదని, ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆట తీరుతో ఛాంపియన్‌గా నిలిచిందని కొనియాడాడు. తమ జట్టు అన్ని విభాగాల్లో విఫలమైందన్నాడు. 'ఈ వికెట్‌పై 444 పరుగుల లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. అయితే గత రెండేళ్లలో మేం కఠిన పరిస్థితుల నుంచే పుంజుకొని విజయాలందుకున్నాం. ఈ తరహా భారీ లక్ష్యాలను చేధించాలంటే భారీ భాగస్వామ్యం అవసరం. మా జట్టులో పెద్ద ప్లేయర్లు ఉన్నా.. ప్రత్యర్థి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

Rahul Dravid says I dont think we have played our best cricket in last 5 days

అయితే ఇది 469 పరుగులు చేయాల్సిన పిచ్ ఏ మాత్రం కాదు. మేం తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసినా.. కాస్త వైడ్‌గా వేయడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. పిచ్‌పై గడ్డి ఉండటంతో పాటు మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం.

సాధారణంగా ఇంగ్లండ్‌లో ఈజీగా బ్యాటింగ్ చేయడం చూస్తుంటాం. ముఖ్యంగా చివరి రెండు రోజులు బౌలింగ్‌కు ఏ మాత్రం సహకారం లభించదు. మేం 70/3 మంచి ఆరంభాన్నే అందుకున్నాం. కానీ ఆ తర్వాతే చేతులెత్తేసాం. ఈ మ్యాచ్‌లో మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ముఖ్యంగా గత ఐదు రోజుల్లో మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాం.

షెడ్యూల్ కూడా చాలా టైట్‌గా ఉంది. ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్స్ కోసం కొన్ని వారాల సమయమే దక్కింది. ఎలాంటి టూర్ గేమ్స్ కూడా లేవు. ఈ విషయంలో ఎవర్నీ నిందిచాలనుకోవడం లేదు. అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియాను మాత్రమే అభినందిస్తున్నా.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, June 11, 2023, 18:43 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+