Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ టోర్నీల ఫైనల్స్ కంటే.. ఆ ఓటమే నన్ను బాధపెట్టింది: రాహుల్ ద్రవిడ్

వన్డే ప్రపంచకప్ 2024, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్స్ కంటే సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమే టీమిండియా హెడ్ కోచ్‌గా తనను తీవ్రంగా బాధపెట్టిందని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రవిశాస్త్రి అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు పెట్టిన రాహుల్ ద్రవిడ్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ముగించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాను విజేతగా నిలబెట్టి ఘనంగా వీడ్కోలు పలికాడు.

రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌తో పాటు డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరింది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా.. వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఎదురైన ఓటముల కంటే సౌతాఫ్రికా 2021-22 పర్యటనలో ఎదురైన టెస్ట్ సిరీస్ పరాజయమే ఇప్పటికీ తనను బాధపెట్టే అంశమని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

Rahul Dravid reveals his lowest point as India head coach

టెస్ట్ సిరీస్ ఓటమే..
తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. 'టీమిండియా హెడ్ కోచ్‌గా నా ప్రయాణంలో లోయెస్ట్ పాయింట్ ఏంటని అడుగుతే.. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమని చెబుతాను. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలోనే ఈ పరాజయం ఎదురైంది. ఈ సిరీస్‌లో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను మేం గెలిచాం.

రెండో, మూడో టెస్ట్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాం. సునాయసంగా సిరీస్ గెలుస్తామని భావించాం. సౌతాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు భారత్ సిరీస్ గెలవలేదు. సిరీస్ గెలిచేందుకు మాకు గొప్ప అవకాశం లభించింది. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఆ సిరీస్ ఆడాం. రోహిత్ శర్మ గాయంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. అతనితో పాటు మరికొంతమంది సీనియర్ ఆటగాళ్ల సేవలను మేం కోల్పోయాం. కానీ ఈ సిరీస్‌లో మేం గట్టిపోటీనిచ్చాం.

ఇప్పటికీ బాధిస్తోంది.
సెకండ్, థర్డ్ టెస్ట్‌ ఓడినా.. అద్భుతంగా పోరాడాం. చివరి టెస్ట్ మూడో ఇన్నింగ్స్‌లో మాకు మంచి అవకాశం లభించింది. మేం మంచి లక్ష్యం నమోదు చేసి గెలవాల్సింది. కానీ సౌతాఫ్రికా అద్భుతంగా ఆడింది. నాలుగో ఇన్నింగ్స్‌లో మా లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. ఈ సిరీస్ ఓటమే టీమిండియా హెడ్ కోచ్‌గా నన్ను బాధపెట్టిన అంశం. సునాయసంగా గెలవాల్సిన సిరీస్‌ను చేజార్చుకోవడం ఇప్పటికీ వెంటాడుతోంది.

కానీ ఈ సిరీస్ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మా జట్టుకు కావాల్సిందేదో తెలుసుకున్నాం. కోచ్‌గా.. సమతూకమైన జట్టును కొనసాగించడం, విజయానికి కావాల్సిన ప్రణాళికలు రచించడం ముఖ్యమైన విషయం. మిగతా జట్లు కూడా విజయం కోసమే ఆడుతాయి. వరల్డ్ క్లాస్ టీమ్స్‌తో ఆడుతున్నప్పుడు ప్రతీసారి విజయం సాధించడం కుదరదు.

ఓటములతో..
విజయానికి కావాల్సినట్లు సన్నదత ఉండాలి. సరైన టీమ్ కాంబినేషన్‌తో పాటు విజయానికి కావాల్సిన వ్యూహాలు రచించుకోవాలి. పరిస్థితులను పసిగట్టి అందుకు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయాలి. ఇలా చేసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు దక్కవు. ఈ ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకొని మరింత బలంగా మారేందుకు ప్రయత్నించాలి.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 10, 2024, 18:41 [IST]
Other articles published on Aug 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+